ఇది వెల్లుల్లి సీజన్, వెల్లుల్లి రెబ్బలు తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ సింపుల్ చిట్కాలను ప్రయత్నించండి.

వెల్లుల్లి ఒక దివ్య ఔషధం. ప్రతి ఒక్క వంటలో వెల్లుల్లిని ఉపయోగిస్తారు. వెల్లుల్లి లేని ఆహారం రుచికరం కాదు. అయితే వెల్లుల్లి తొక్క తీయడం అంటే కొంచెం కష్టమైన పని.


దీంతో వెల్లుల్లి తొక్కను ఈజీగా తీసేందుకు ఐదు అద్భుతమైన ఉపాయాల గురించి తెలుసుకుందాం. ఇవి ఈ పనిని చాలా సులభతరం చేస్తాయి. ఈ టిప్స్ మీ సమయాన్ని ఆదా చేయడమే కాదు.. క్షణాల్లో వెల్లుల్లి తొక్కను తీసివేస్తారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వెల్లుల్లిని ఉపయోగించవచ్చు. ఈ రోజు గోర్లు నొప్పి పట్టకుండా వెల్లుల్లి తొక్కలను ఎలా వలచుకోవచ్చో తెలుసుకుందాం.

వేడి నీరు పనిచేస్తుంది

ముందుగా వెల్లుల్లి రెబ్బలను వేరు చేసి ఒక గిన్నెలో వేయండి. ఇప్పుడు వీటిపై వేడి నీరు పోసి 5-10 నిమిషాలు అలాగే ఉంచండి. వేడి నీటి వల్ల వెల్లుల్లి పై పొర మృదువుగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, వెల్లుల్లి తొక్కలు సులభంగా వస్తాయి. మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు.

మైక్రోవేవ్ వాడకం:

వెల్లుల్లి రెమ్మల తొక్కలు తీసేందుకు మైక్రోవేవ్ కూడా ఉపయోగపడుతుంది. అవును వెల్లుల్లి రెబ్బలను వేరు చేసి వాటిని మైక్రోవేవ్-సేఫ్ గిన్నెలో వేసి 10-15 సెకన్ల పాటు మైక్రోవేవ్ చేయండి. మైక్రోవేవ్ లోని వేడి వల్ల తొక్కలు వదులుతాయి. తర్వాత వెల్లుల్లి రెమ్మలను కొంచెం నలిపితే ఈజీగా పీల్ విడిపోతుంది.

షేక్-షేక్ పద్దతి

ఈ పద్ధతి మీరు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వెల్లుల్లి తొక్క తీయవలసి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. దీని కోసం వెల్లుల్లి రేమ్మల్ని విడదీసుకుని ఒక ఆ మొగ్గలను ఒక పెద్ద స్టీల్ గిన్నెలో లేదా రెండు సమాన పరిమాణం గల గిన్నెలలో వేయండి. తర్వాత గిన్నెను గట్టిగా మూసివేసి 30-60 సెకన్ల పాటు గట్టిగా కదిలించండి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి రెబ్బలు ఒకదానికొకటి ఢీకొని వాటి తొక్కలు కొంచెం లూజ్ అవుతాయి. దీంతో గిన్నెలోని వెల్లుల్లి రెమ్మల తొక్కలు విడిపోతాయి. సులభంగా తొక్కల్ని వేరు చేయవచ్చు.

నైఫ్ ని ఉపయోగించి

ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెమ్మలకు మాత్రమే తొక్క తీయాల్సి వస్తే ఈ పద్ధతి ఉత్తమమైనది. ముందుగా వెల్లుల్లి రెమ్మలను కట్టింగ్ బోర్డు మీద ఉంచండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని దీనిని అడ్డంగా పెట్టి.. వెల్లుల్లి మొగ్గపై ఉంచి.. దీనిని సున్నితంగా నొక్కండి లేదా తట్టండి. తేలికపాటి ఒత్తిడితో వెల్లుల్లి మొగ్గను నొక్కితే తొక్క వెంటనే విడిపోతుంది. దానిని సులభంగా తొలగించవచ్చు.

చిన్న గాడ్జెట్

సిలికాన్ వెల్లుల్లి తొక్క తీసే యంత్రం ఇది చాలా ఉపయోగకరమైన చిన్న గాడ్జెట్. మీ దగ్గర సిలికాన్ వెల్లుల్లి పీలర్ ఉంటే.. దీని లోపల వెల్లుల్లి రెబ్బను చొప్పించండి. ఇప్పుడు దీనిని అరచేతితో చుట్టూతిప్పండి. ఆపై కొన్ని సెకన్లలో తొక్క విడిపోతుంది. మొగ్గ బయటకు వస్తుంది. వెల్లుల్లి తొక్క తీయడానికి ఇది చాలా శుభ్రమైన, ప్రభావవంతమైన మార్గం.

నూనె రాసి ఎండలో పెట్టండి..

ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి తొక్కలు తీయాలంటే.. చాలా సింపుల్ టిప్.. వెల్లుల్లి రెమ్మలని ఒక ప్లేట్ లో వేసుకుని వాటికి నూనె రాసి మంచి ఎండలో పెట్టండి. మధ్యాహ్నం వెల్లుల్లి పాయలను చేతితో సున్నితంగా నలిపితే తొక్కలు చాలా సులభంగా విడిపోతాయి. ఈ పెద్దలు పాటించే టిప్.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.