Drinking Water : ప్రకృతిలో ఇతర జీవరాశులు, జంతువులు వాటికి శరీరంలో నలతగా ఉన్నప్పుడు నీటిని తాగి విశ్రాంతిని తీసుకుంటాయి. ఇతర ఆహారాల జోలికి అవి వెళ్లవు. ఇలా నీటిని తాగి విశ్రాంతి తీసుకోవడం శరీరంలో తలెత్తిన ఇబ్బంది వెంటనే తగ్గుతుంది. శరీరంలో ఎక్కడైతే సమస్య తలెత్తిందో ఆ సమస్యను తగ్గించడానికి శరీరమంతా ఆ భాగం కేంద్రంగా పని చేస్తుంది. దీంతో సమస్య వెంటనే తగ్గుతుంది. అలాగే నీటిని తాగడం వల్ల ఆ భాగాన్ని రిపేర్ చేసే సమయంలో వెలువడిన రసాయనాలు, వ్యర్థాలు నీటి ద్వారా బయటకు పోతాయి. శరీరంలో ఏర్పడిన ఈ వ్యర్థాలను బయటకు పంపించడంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. నీటిని తాగకపోతే శరీరంలో ఏర్పడిని వ్యర్థాలను కాలేయం బయటకు పంపించలేదు. కాలేయంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ ఆగిపోతుంది. కనుక జంతువులు శరీరంలో అనారోగ్యం తలెత్తినప్పుడు కేవలం నీటిని మాత్రమే తాగి తగిన విశ్రాంతి తీసుకుంటాయి.
దీంతో ఎటువంటి మందులు వాడే అవసరం లేకుండా వాటంతట అవే తిరిగి కోలుకుంటాయి. ఇలా ప్రకృతి అంతా చేస్తున్నప్పటికి మనం మాత్రం చిన్న అనారోగ్య సమస్య కలగగానే మందులు మింగి దానిని నయం అయ్యేలా చేస్తున్నాము. కానీ ఇది మంచి పద్దతి కాదు. కనుక మనం కూడా చిన్న చిన్న సమస్యలు అనగా జలుబు, దగ్గు, గొంతు ఇన్పెక్షన్, జ్వరం, టానిల్స్, నోరు చేదుగా ఉండడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు శరీరం చెప్పినట్టుగా మనం వినడం మంచిది. శరీరానికి ఆహారం తీసుకోకుండా విశ్రాంతి ఇవ్వడం వల్ల శరీరంలో రిపేర్ మరియు క్లీనింగ్ చక్కగా జరుగుతుంది. దీంతో శరీరంలో నలతకు కారణమై వైరస్, బ్యాక్టీరియాలపై తెల్ల రక్తకణాలు దాడి చేసి సమస్యను త్వరగా తగ్గిస్తాయి. మనం కూడా శరీరంలో నలతగా ఉన్నప్పుడు రోజంతా నీటిని తాగుతూ విశ్రాంతి తీసుకుంటూ ఉండవచ్చు. ఒకవేళ బయట తిరిగే వారు అయితే మధ్య మధ్యలో నీటిలో తేనె, నిమ్మరసం కలిపి కూడా తీసుకోవచ్చు. దీంతో నీరసం రాకుండా ఉంటుంది. ఒకవేళ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారు అయితే కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచిది.
అయితే కొందరు నీటికి బదులుగా జావలు, పండ్ల రసాలు, మజ్జిగ వంటి వాటినితాగుతూ ఉంటారు. కానీ వీటిని కూడా తీసుకోకుండా కేవలం మంచి నీటిని తాగి ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే సమస్య తలెత్తిన తరువాత లంకనం చేయడం కంటే సమస్య తలెత్తే ముందే మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే నీటిని తాగి లంకనం చేయడం వల్ల సమస్య తీవ్రంగా మారకుండా ఉంటుంది. ఇలా నీటిని తాగే సమయంలో బాగా నీరసంగా ఉంది అనుకున్న వారు ఒక గ్లాస్ నీటిలో 4 నుండి 5 స్పూన్ల తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. కనుక ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు మందులు మింగడానికి బదులుగా కేవలం నీటిని తాగి విశ్రాంతి తీసుకోవడం వల్ల మందులు వాడే అవసరం లేకుండా సమస్య నుండి సహజ సిద్దంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.