ఇటీవల కాలంలో సినిమా స్థాయి పెరిగింది. ఇండియన్ సినిమాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో కంటెంట్ లేకపోయినప్పటికీ భారీగా నిర్మించి చేతులు కాల్చుకుంటున్నారు.
భారీ బడ్జెట్‌తో నిర్మించబడి, అంచనాలకు తగ్గకుండా వసూళ్లు చేయలేకపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. అయితే అంచనాలకు తగ్గ వసూళ్లు సాధించలేకపోయింది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువా’ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. నిర్మాతలకు ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల నష్టాలను మిగిల్చింది. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఈ సినిమా అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘బడే మియా చోటే మియా’ సినిమా కూడా భారీ నష్టాలను మిగిల్చింది. అయితే ఓ సినిమా మాత్రం ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. హీరోను నమ్మి రూ.150 కోట్లు ఖర్చు పెడితే , బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా కేవలం రూ.18 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.
ఆ సినిమా మరేదో కాదు ‘గణపత్: పార్ట్ 1’. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో కనిపించారు. 2023లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ, వసూళ్ళ పరంగా పూర్తిగా నిరాశపరిచింది.
నిర్మాతలు ఈ సినిమా కోసం ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు పెట్టగా, కేవలం రూ. 18 .కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. భారతదేశంలో రూ.13.02 కోట్లను వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద ‘గణపత్: పార్ట్ 1’ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాను “ఆల్-టైమ్ డిజాస్టర్” గా పరిగణిస్తున్నారు. ఇది టైగర్ ష్రాఫ్ కెరీర్‌లో అత్యల్ప వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా దెబ్బకు మేకర్స్ సీక్వెల్‌ను తీయడం ఆపేశారు.