తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలంలో జరిగిన కేబినేట్ సమావేశం ముగిసింది. ఐదు గంటలపాటు సుదీర్ఘంగా ఈ సమావేశం సాగింది.


ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు(Telangana Employees) రెండు డీఏలు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించారు. మెట్రో రెండో విడత విస్తరణ, ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్‌ ఫామ్‌ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయింపు, మహిళా స్వయం సహాయక బృందాల సభ్యుల ప్రమాద బీమా.. లోన్‌ బీమా చెల్లింపుల కోసం రూ.70 కోట్లు కేటాయింపు, గ్రామీణ రోడ్ల ఆధునీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాల డిమాండ్లను కేబినెట్‌లో చర్చించాం. రెండు డీఏలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఒక డీఏ ఇప్పుడు, మరో డీఏ ఆరు నెలల్లో ఇస్తాం. ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు ప్రతినెలా రూ.700 కోట్లు కేటాయిస్తాం. రిటైర్ అయ్యాక పదవీకాలం పొడిగింపు ఇక నుంచి ఉండదు అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.