స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చాలా కంపెనీలు ఫ్రీడమ్ సేల్స్ ద్వారా వినియోగదారులకు ప్రత్యేక తగ్గింపులను అందిస్తున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్స్‌లో ఫ్రీడమ్ సేల్స్ ముగియగా ప్రస్తుతం ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఫ్రీడమ్ సేల్స్ ఊపందుకున్నాయి.
తాజాగా ప్రముఖ కంపెనీ విజయ్ సేల్స్ తన మెగా ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించింది, ఆడియో పెరిఫెరల్స్, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది. విజయ్ సేల్స్‌లో ఉన్న ప్రతి ఉత్పత్తిపై ప్రత్యేక తగ్గింపు అందిస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ ప్రత్యేక ఆఫర్లను విజయ్ సేల్స్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో విజయ్ సేల్స్ ఫీడమ్ సేల్ గురించి వివరాలను తెలుసుకుందాం.
సీఎంఎఫ్ ఫోన్ 1
లండన్ ఆధారిత ఫోన్ తయారీ సంస్థ నథింగ్ ఇటీవల సీఎంఎఫ్ ఫోన్ 1 పేరుతో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. మీడియా టెఖ్ డైమెన్సిటీ 2500 చిప్‌సెట్ ద్వారా పని చేసే ఈ ఫోన్‌పై ఫ్రీడమ్ సేల్ ప్రత్యేక తగ్గింపులను అందిస్తుంది. సీఎంఎఫ్ ఫోన్ 1 6.7-అంగుళాల 120 హెచ్‌జెడ్ ఎమోఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో రూ. 15,999కి అందుబాటులో ఉంది. అయితే మీరు వన్ కార్డు ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. అలాగే యస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, ఫెడరల్ కార్డ్ హోల్డర్‌లు 5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఆర్‌బీ కార్డ్ హోల్డర్‌లకు 7.5 శాతం తగ్గింపును కూడా అందిస్తుంది.
వన్ ప్లస్ 12 ఆర్
ఈ ఫోన్‌ను 2024 జనవరిలో వన్ ప్లస్ ప్రారంభించింది. స్నాప్ డ్రాగ్ జెన్ 2 చిప్‌సెట్ ఆధారంగా పని చేసే ఈ ఫోన్ 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎమోఎల్ఈడీ స్క్రీన్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌ను రూ. 41,999కి కొనుగోలు చేయవచ్చు. అయితే ఐసీఐసీ కార్డ్ హోల్డర్లు ఈఎంఐ లావాదేవీలపై రూ. 2,000 తగ్గింపును పొందవచ్చు. విజయ్ సేల్స్ కూడా వన్ ప్లస్ ఈఎంఐ, హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 5 శాతం మరియు 7.5 శాతం తగ్గింపును అందిస్తోంది.
ఐఫోన్15
ఫ్లిప్ కార్ట్ మాదిరిగానే విజయ్ సేల్స్ కూడా ఐఫోన్ 15ని తగ్గింపు ధరకు అందిస్తోంది. ఐఫోన్ 15 బేస్ వేరియంట్ 128 జీబీ ర్యామ్‌తో వచ్చే 6.1-అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది. 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్, SBI క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 4,000 తగ్గింపు పొందవచ్చు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్, ఆర్‌బీఎల్ కార్డ్ వినియోగదారులు ఈఎంఐ లావాదేవీలపై 7.5 శాతం తగ్గింపును పొందవచ్చు. అలాగే వన్ కార్డు, యస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, ఫెడరల్ కార్డ్ హోల్డర్‌లు 5 శాతం తగ్గింపును పొందవచ్చు.