ఇంట్లో ఆర్థిక సమస్యలు పోవాలంటే.. మనీ ప్లాంట్‌ ఇక్కడ పెట్టుకోవాలట!

హిందూ సంప్రదాయంలో అనేక రకాల వృక్షాలు, మొక్కలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. వీటిల్లో పలు రకాల దేవతలు నివాసం ఉంటారని నమ్మకం. ఈ మొక్కలు, వృక్షాలకు కూడా పూజలు చేస్తూ ఉంటారు.


వీటిని ఇంట్లో, కార్యాలయాల్లో పెట్టుకుంటే ఎంతో మంచిది. ఈ మొక్కల్లో మనీ ప్లాంట్ కూడా ఒకటి. అయితే ఈ మొక్కకు ఎలాంటి పూజలు చేయరు. కేవలం డబ్బు సమస్యలు పరిష్కరించడం కోసం కొందరు పెట్టుకుంటే.. మరికొందరు మాత్రం ఇంట్లో అందం పెరగడం కోసం పెడుతూ ఉంటారు. ఈ మనీ ప్లాంట్ ఇప్పుడు అందరి ఇళ్లలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.

ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు..

ఈ మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఇంట్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు పోతాయని, ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారని భావిస్తారు. ఇంటికి, ఇంట్లోని సభ్యులకు అదృష్టం కలిసి వస్తుందని చెబుతారు. అయితే మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకునే విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఈ మొక్కను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో మాత్రమే పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

ఇలా పెడితేనే సరైన ఫలితాలు ఉంటాయి..

ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, ఖర్చులకు డబ్బులు సరిపోవడం లేదనే వాళ్లు, వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు.. మనీ ప్లాంట్‌ని పలు ప్రత్యేకమైన ప్రదేశాల్లో పెట్టాలి. అప్పడే సరైన ఫలితాలు ఉంటాయి. మనీ ప్లాంట్‌ని ఇంట్లో పెట్టే విధానం బట్టి.. మనకు లక్ష్మీ దేవి, శ్రీ మహా విష్ణువుల ఆశీస్సులు లభిస్తాయి.

ఈ దిశ బెస్ట్..

ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టాలి అనుకునేవారు.. ఇంట్లో ఆగ్నేయ దిశలో పెడితే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకుంటుంది. ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లోని సమస్యల నుంచి కూడా బయట పడతారు. అదే విధంగా మనీ ప్లాంట్‌ను ఈశాన్య దిశలో అస్సలు ఉంచకూడదు. ఇలా పెట్టడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది.