Flax Seeds Karam Podi : మనల్ని వేధించే అనారోగ్య సమస్యలల్లో రక్తహీనత కూడా ఒకటి. ఈ సమస్యతో పెద్దలు, పిల్లలు బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు.
రక్తహీనత కారణంగా మనం వివిధ రకాల ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నీరసం, బలహీనత, కళ్లు తిరిగినట్టుగా ఉండడం, వికారం, జుట్టు రాలడం, చర్మం పాలిపోవడం వంటి సమస్యలతో పాటు రక్తహీనత కారణంగా శరీరంలో అవయవాలకు ఆక్సిజన్ సరఫరా, పోషకాల సరఫరా కూడా తగ్గుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి వైద్యులు ఎక్కువగా ఐరన్ క్యాప్సుల్స్ ను వాడమని చెబుతూ ఉంటారు. గర్భిణీలకు, బాలింతలకు కూడా రక్తహీనత సమస్య రాకుండా ముందు నుండే ఐరన్ క్యాప్సుల్స్ ను వాడమని సూచిస్తూ ఉంటారు. అయితే ఇలా రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఐరన్ క్యాప్సుల్స్ కు బదులుగా అవిసె గింజలతో చేసిన కారం పొడిని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయని వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెప్పడంతో వీటి వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యిందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ అవిసె గింజలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సినంత ఐరన్ కూడా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మనకు ఒక రోజుకు పురుషులకు 28 మిల్లీ గ్రాములు, స్త్రీలకు 30 మిల్లీ గ్రాముల ఐరన్ అవసరమవుతుంది. శరీరంలో తగినంత ఐరన్ ఉంటేనే ఎర్రరక్తకణాల తయారీ జరుగుతుంది. రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. ఇలా రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఈ సమస్య భవిష్యత్తులో రాకూడదు అనుకునే వారు అవిసె గింజల కారం పొడిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 100గ్రాముల అవిసె గింజలల్లో 100 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో అవిసె గింజలు ఒకటి.
అవిసె గింజలను తీసుకోవడం వల్ల ఐరన్ తో పాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. అయితే చాలా మందికి అవిసె గింజల కారం పొడినే ఎందుకు తీసుకోవాలి.. వీటిని నానబెట్టి, మొలకెత్తించి తీసుకోకూడదా అనే సందేహం కూడా వస్తూ ఉంటుంది. అవిసె గింజలు బంకగా, జిగటగా ఉంటాయి. వీటిని నానబెట్టి తీసుకుంటే నోరంతా బంకగా తయారవుతుంది. ఇవి నానబెట్టి తీసుకోవడానికి అస్సలు బాగోవు. వీటిని తింటున్నంత సేపు వికారంగా ఉంటుంది. కనుక వీటిని వేయించి కారం పొడి చేసి తీసుకోవడమే ఉత్తమమైన మార్గం. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఈ కారం పొడిని తయారు చేసుకుని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇడ్లీ, దోశ వంటి వాటితో పాటు కూరలల్లో కూడా ఈ కారం పొడిని వేసుకోవచ్చు. అలాగే అన్నంలో మొదటి ముద్దగా ఈ కారం పొడిని తీసుకోవచ్చు. ఈ విధంగా అవిసె గింజలతో కారం పొడిని తయారు చేసి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.