Flowers: పూజకు ఉపయోగించిన పువ్వులను ఆ తర్వాత ఏం చేయాలో మీకు తెలుసా?

మామూలుగా చాలామందికి కలిగే సందేహం పూజ చేసిన తర్వాత ఆ పువ్వులను ఏం చేయాలి. ఈ సందేహం మనలో చాలామందికి కలిగే ఉంటుంది. అయితే కొంతమంది ఆ పువ్వులన్నీ సేకరించి ఎక్కడైనా పారి నదిలో లేదా నీటిలో పారవేస్తే ఇంకొందరు చెత్తకుప్పల్లో, లేదంటే కంపోస్టుగా తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు.


మరి నిజానికి పూజకు ఉపయోగించిన పువ్వులను ఏం చేయాలి అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గా మనం దేవుడికి పూలను సమర్పించే పువ్వులను చాలా పవిత్రంగా భావిస్తుంటాం.

ఈ పువ్వును బయట కూడా పారేయడానికి ఇష్టపడరు. కానీ పూజ చేసేటప్పుడు పాత పువ్వులను తీసేసి కొత్త పువ్వులను దేవుడి దగ్గర పెడుతుంటారు. అయితే చాలా మంది ఈ పువ్వులు దేనికీ పనికి రావని పారేస్తుంటారు. ఈ పువ్వులనే కాదు ఇంట్లో పూజ చేసిన పువ్వులను కూడా ఇలాగే చేస్తారు. కానీ ఈ పువ్వులు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయట. పూజకు ఉపయోగించిన పూలను ఇంటి నుంచి తోట పనుల వరకు ఎన్నో విధాలుగా ఉపయోగించవచ్చు. మనలో చాలా మంది పూజ చేసిన తర్వాత చాలా వస్తువలను దేనికీ ఉపయోగపడవని భావిస్తుంటారు. వాటిని చెత్తలో వేస్తుంటారు. వీటిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు.

తోట పనిని ఇష్టపడే వారికి ఎండిపోయిన పువ్వులను ఎన్నో విధాలుగా సహాయపడతాయి. దేవుడికి సమర్పించిన పువ్వులను మీరు అగర్ బత్తీలను తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఉపయోగించే పువ్వులు మురికిగా లేదా చెడిపోయినవి అయ్యి ఉండకూడదు. శుభ్రమైన పువ్వులను తీసుకుని వాటి కాడలను తొలగించి రేకులను ఎండలో బాగా ఎండబెట్టండి. ఆ తర్వాత పువ్వులను గ్రైండర్ లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆవు పేడ పిడకలు, గుగ్గుల పొడి, కర్పూరం, లవంగాలు, గంధం, సుగంధ ద్రవ్యాలు, నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు తయారు చేసిన మెటీరియల్ నుంచి అగర్ బత్తీలను తయారు చేసుకోవాలి. అయితే పువ్వులను ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయాలని చెబుతున్నారు.