రాత్రి నిద్రపోయే ముందు ఈ నియమాలు పాటించండి.. ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తవు..

చార్య చాణక్యుడు చెప్పిన జీవన విధానాల గురించి మనందరికీ తెలుసు. ఆచార్య చాణక్యుడు అతని కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా కూడా పేరు పొందాడు. తన జీవితకాలంలో ఆయన అనేక రకాల విధానాలను రచించాడు.


వాటిల్లో ఒకటి నీతి శాస్త్రం. ఇదే చాణక్య నీతిగా ప్రసిద్ధిగాచింది. ఈ విధానాలలో ఆచార్య చాణక్యుడు రాత్రి పడుకునే ముందు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలను ప్రస్తావించాడు. ఎవరైనా సరే ఈ విషయాలను జాగ్రత్తగా ఆచరిస్తే అతని జీవితం సంపద, శ్రేయస్సుతో నిండిపోతుంది. ఆ నియమాలను పాటిస్తే, లక్ష్మిదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. కనుక ఈ రోజు రాత్రి నిద్రపోయే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం..

ఇంటి ప్రధాన ద్వారం శుభ్రం
చాణక్య నీతి ప్రకారం.. మీరు మీ జీవితంలో ఏదైనా డబ్బుకు సంబంధించిన లేదా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే.. రాత్రి పడుకునే ముందు ఇంటి ప్రధాన ద్వారం పూర్తిగా శుభ్రం చేయాలి. అంతేకాదు ఇంటి ఉత్తరం వైపు కూడా సరిగ్గా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఉదయం ఇంటి తలుపు తెరవడానికి కూడా నియమాలను పాటించాలి. పెరటి తలుపు ముందు తెరచి.. తర్వాత వీధి తలుపులను తెరవాలి. అదే సమయంలో చెత్తను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్ళే సమయంలో కూడా జాగ్రత్త వహించాలి.

పూజా స్థలంలో సమర్పించిన పువ్వులను తొలగించండి.
ఆచార్య చాణక్యుడి ప్రకారం రాత్రి పడుకునే ముందు ఉదయం పూజలో ఉపయోగించిన పువ్వులను తీసివేయాలి. అంతేకాదు దేవుడి పూజ గదిలో ఉండే కలశాన్ని శుభ్రమైన, స్వచ్ఛమైన నీటితో నింపాలి. ఇలా చేయడం వలన జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎప్పటికీ ఎదురుకావు.

రాత్రి సమయంలో దీపం వెలిగించడం చాలా శుభప్రదం.
జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతను తొలగించాలనుకుంటే రాత్రి సమయంలో దీపం వెలిగించడం చక్కటి పరిష్కారం. లవంగాలను దీపంలో పెట్టి వెలిగించాలి. ఇలా చేయడం వలన జీవితంనుంచి మాత్రమే కాదు ఇంటి నుండి అన్ని రకాల ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.