ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తాజాగా ‘స్వరైల్’ (SwaRail App) పేరుతో కొత్త యాప్ తీసుకొచ్చింది. దీనిని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) అభివృద్ధి చేసింది.
పాత ‘IRCTC Rail Connect’ యాప్‌కి కొత్త వెర్షన్‌గా దీనిని తీసుకొచ్చారు.
ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బీటా వెర్షన్ అయినా, ఇప్పటికే ఉన్న రైల్ కనెక్ట్ అకౌంట్‌తో లాగిన్ అయ్యే వీలుంది లేదా కొత్త అకౌంట్ కూడా క్రియేట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
టికెట్ బుకింగ్ సులభతరం
స్వరైల్ యాప్ ద్వారా రిజర్వ్ చేసిన టిక్కెట్లు, జనరల్ టిక్కెట్లు, అలాగే ప్లాట్‌ఫాం టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. మీరు కావాల్సిన రైలు వివరాలను ఎంటర్ చేసి, తదుపరి స్క్రీన్‌లో స్టేషన్‌లు, తేదీ, క్లాస్ ఎంచుకున్న తర్వాత, యాప్ రైళ్ల లిస్టును చూపిస్తుంది – ఇది IRCTC వెబ్‌సైట్ తరహాలో ఉంటుంది.
ఇతర రైల్వే యాప్‌ల మాదిరిగా కాకుండా, స్వరైల్ ఆధునిక ఇంటర్‌ఫేస్‌తో రూపొందించారు. సింపిల్ స్టెప్స్‌తో టికెట్ బుక్ చేసుకోవచ్చు. అథెంటికేషన్ కోసం ఫేస్ ఐడీ (iPhone) లేదా ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ (Android) వంటివి ఉపయోగించవచ్చు. యాప్ హోమ్ స్క్రీన్ నుంచే రైళ్ల సెర్చ్, PNR స్టేటస్ చెక్ చేయడం, కోచ్ స్థానం తెలుసుకోవడం, రియల్ టైమ్‌లో రైలు ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్ చేయడం, ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం, టికెట్ రిటర్న్ కోసం రిక్వెస్ట్ చేయడం వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి.
మొత్తానికి, ఒకే యాప్‌తో అన్ని అవసరాలను అందించేలా స్వరైల్ యాప్‌ను రూపొందించారు. తరచూ రైలు ప్రయాణాలు చేసే ప్రయాణికుల కోసం ‘మై బుకింగ్స్’ అనే ప్రత్యేక విభాగం కూడా ఉంది.