యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువును వచ్చే ఏడాదికి పొడిగించింది. గతంలో తెలిపిన విధంగా ఉచిత ఆధార్ అప్‌డేట్‌కు ఈ రోజు చివిరి తేదీ.
కానీ దాన్ని వచ్చే ఏడాది జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటన విడుదల చేసింది. ఈమేరకు ఆధార్ అధికారిక ఎక్స్ లింక్‌లో వివరాలు పోస్ట్ చేసింది.
యూఐడీఏఐ వెల్లడించిన గడువు (2025, జూన్ 14) లోపు ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్‌డేట్ చేసుకుంటే మాత్రం.. రూ.50 అప్లికేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ చేసుకోవడం ఎలా?
● మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి
● లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
● నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.
● రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
● అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.
● మీరు ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
● అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్‌డేట్‌ను ట్రాక్ చేయవచ్చు.