ఒక వ్యక్తి పరాజయాన్ని ఎంతోమంది ఎంజాయ్ చేస్తున్నారంటే, ఆ వ్యక్తి విజయం సాధిస్తే దాని వల్ల పరిణామాలు తలచుకొని వణికిపోతున్నారని అర్థం.
ప్రస్తుతం రామ్ చరణ్ పరిస్థితి చూస్తే అదే అనిపిస్తుంది. చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలతో సరిసమానంగా వసూళ్లు, ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక రెండవ సినిమాతో అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ హిట్స్ అన్నిటిని అధిగమించి, అల్ టైం రికార్డ్స్ ని క్రియేట్ చేస్తూ, ఇండస్ట్రీ హిట్ ని అందుకొని సూపర్ స్టార్స్ లో ఒకడిగా మారిపోయాడు. ఇక ఆ తర్వాత యావరేజ్ సినిమాలను సైతం బ్లాక్ బస్టర్స్ గా మార్చి ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసాడు. మధ్యలో రామ్ చరణ్ నటనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు తన ‘రంగస్థలం’ చిత్రంతో చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు.
#RRR చిత్రంతో గ్లోబల్ వైడ్ గా స్టార్ స్టేటస్ ని దక్కించుకొని అతి తక్కువ సినిమాలతో ఎక్కువ స్టార్ స్టేటస్ ని తెచ్చుకున్న హీరోగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో ఉంటున్న హీరోలకు కూడా లేని రికార్డ్స్ రామ్ చరణ్ పేరిట ఉన్నాయి. ఆయన హిట్ కొడితే ఎలా ఉంటుందో తనని ద్వేషించే వారికి తెలుసు, అందుకే వాళ్ళు ‘గేమ్ చేంజర్’ ఫలితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్ చుట్టూ ఉన్నవాళ్ళే ఈ సినిమాకి వెన్నుపోటు పొడిచారు. స్వయంగా నిర్మాత దిల్ రాజే ఈమధ్య ఈ చిత్రంపై సెటైర్లు వేయడం, ఎవరైనా ఈ చిత్రం పై సెటైర్లు వేస్తే పగలబడి నవ్వడం వంటివి చేసాడు. ‘గేమ్ చేంజర్’ చిత్రం అనేది కేవలం దిల్ రాజు ఒక్కడిదే కాదు. ఎంతో మంది కష్టం, ముఖ్యంగా గ్లోబల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న ఒక హీరో ఇలాంటి సినిమాకి మూడేళ్ళ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు.
కానీ నిర్మాతని, డైరెక్టర్ ని నమ్మి హీరో ఆ అవకాశం ఇచ్చాడు. కానీ హీరో ఇచ్చిన ఆ మూడేళ్ళ విలువైన సమయానికి ఎలాంటి విలువ ఇవ్వట్లేదు నిర్మాత. పైగా ఈ చిత్రం ఫ్లాప్ అయ్యినందుకు ఒక ప్రముఖ హీరో తన సన్నిహితులను పిలిచి పార్టీ ఇప్పించాడట. సినిమా విడుదలైన రోజే HD ప్రింట్ ని విడుదల చేయమని డబ్బులిచ్చి కుట్ర చేయించిన హీరో కూడా అతనేనట. ఇవన్నీ దిల్ రాజు కి తెలుసు, ఆయన కూడా వెనుకచేరి రామ్ చరణ్ మీద సెటైర్లు వేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే టాక్. టాక్ అని అనాల్సిన అవసరం కూడా లేదు, దిల్ రాజు యాక్షన్స్ చూస్తే ఎవరికైనా ఆ విషయం అర్థం అవుతుంది. ఈ సంక్రాంతికి దిల్ రాజు కి ఒక్క పైసా నష్టం జరగలేదు. కానీ నష్టపోయింది మాత్రం రామ్ చరణ్. విలువైన ఆ మూడేళ్ళ సమయం మళ్ళీ తిరిగి రమ్మంటే వస్తుందా?, రాదు కదా? ఇకనైనా రామ్ చరణ్ తన చుట్టూ ఎలాంటి మనుషులు ఉన్నారో తెలుసుకుంటే బాగుంటుంది అంటూ సోషల్ మీడియా లో ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.