Keerthy Suresh: ఓటీటీలోకి కీర్తి సురేష్ బోల్డ్ మూవీ.. టీజర్‌తోనే చెమటలు పట్టిస్తున్న బ్యూటీ

‘నేను లోకల్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్ (Keerthy Suresh). ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ.. ‘మహానటి’ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌ (Overnight star0గా మారిపోయి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.


తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఈ క్రమంలో భాషతో సంబంధం లేకుండా తమిళ (Tamil), హిందీ (Hindi) భాషల్లో కూడా సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. అంతే కాకుండా.. తాజాగా ఈ బ్యూటీ తన చిన్ననాటి స్నేహితుడైనా ఆంటోని తటిల్‌ (Antony Tattle)ను పెళ్లి చేసుకుని బ్యూచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసింది. కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారడంతో కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తే.. మరికొందరు మాత్రం తమ హీరోయిన్ పెళ్లి చేసేసుకుంది అంటూ నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఇక పెళ్లి అయిన కూడా తను నటించిన ‘బేబీ జాన్’ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటు అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు అమెజాన్ (Amazon) ఒరిజినల్స్ చేసిన ఈ మహానటి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఒరిజినల్స్‌లోకి అడుగుపెట్టింది. కీర్తి సురేష్ నటించిన ఓ బోల్డ్ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయింది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో కీర్తి కొంచెం బోల్డ్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. ఇక మూవీ విషయానికి వస్తే.. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అక్కా’ (Akka). అక్కా అనే టైటిల్ రోల్‌లో కీర్తి నటిస్తున్నట్లు తెలుస్తుండగా.. సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చి అక్కడ ఉన్న వారికి చెమటలు పట్టించింది. ‘మాతృస్వామ్యం బలంగా నిలుస్తుంది. ఒక తిరుగుబాటుదారుడు వారి పతనానికి పన్నాగం పన్నాడు. పేర్నూరుకు చెందిన ఒక అమ్మాయి అక్కలపై ప్రతీకారం తీర్చుకుంటుంది. అక్కా త్వరలో వస్తుంది, నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే’ అంటూ టీజర్‌ను రిలీజ్ చేశారు.. కానీ డేట్ మాత్రం రివీల్ చేయలేదు.