Gongura Pachadi:కేవలం 2 నిమిషాల్లో గోంగూర పచ్చడి రుచిగా రావాలంటే ఇలా చేయండి

www.mannamweb.com


Gongura Pachadi:కేవలం 2 నిమిషాల్లో గోంగూర పచ్చడి రుచిగా రావాలంటే ఇలా చేయండి

Gongura Pachadi:కేవలం 2 నిమిషాల్లో గోంగూర పచ్చడి రుచిగా రావాలంటే ఇలా చేయండి..గోంగూర పచ్చడి..పొరుగింటి గోంగూర పుల్లన అంటారు.ఇంట్లో చేసిన దానికంటే ,ఫంక్షన్ లో చేసిన గోంగూర పచ్చడిని,లొట్టలు వేసుకుంటూ తింటుంటారు.అచ్చం ఫంక్షన్ స్టైల్ గోంగూర పచ్చడిని,ఇంట్లోనే ఎలా చేసుకోవాలో తెల్సుకుందాం.

కావాల్సిన పదార్థాలు
గోంగూర – 2 కట్టలు
ఆయిల్ – 2 స్పూన్లు
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు -8
పచ్చిమిర్చి -6
వెల్లుల్లి రెబ్బలు -4
టమాటలు -2
సాల్ట్ – తగినంత
పసుపు – ½ టీ స్పూన్
మెంతుల పొడి – 1/4 టీ స్పూన్

తయారీ విధానం
ముందుగా గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి.
2.స్టవ్ పై కడాయి పెట్టి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, వేడెక్కిన ఆయిల్ లోకి,
జీలకర్ర, ధనియాలు,ఎండుమిర్చి తుంచుకుని వేసుకోండి.
3. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బులు వేసేసి లో ఫ్లేమ్ లో మాడకుండా వేయించుకోండి.
4. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటలు యాడ్ చేసుకుని, కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసుకుని,
దగ్గరికి వచ్చే వరకు ఉడకనీవ్వండి.
5. ఉడికిన టమాటాలోకి గోంగూర ఆకులు వేసుకుని , బాగా మిక్స్ చేసుకుని మెత్తగా ఉడికించుకోండి.
6. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని పావు టీ స్పూన్ మెంతిపొడి వేసి, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి.
7. ఇప్పుడు తాళింపు కోసం కడాయిలో ఒక టెబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, వేడెక్కిన ఆయిల్లో తాళింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ యాడ్ చేసుకుని , రెండు ఎండు మిరపకాయలు తుంచి వేసుకోవాలి.
8. చివరగా కరివేపాకు వేసుకుని, వేగిన పోపులోకి గోంగూరపచ్చడి వేసుకోవాలి.
9. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే, అదిరిపోయే గోంగూర చెట్నీ రెడీ.