ఏపీ మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం ప్రకటన

ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆయన కీలక ప్రకటన చేశారు.


ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు (Free bus for women in AP) ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కర్నూల్ జిల్లాలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (Swarna Andhra – Swachha Andhra) కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు ప్రకటన చేశారు. అలాగే వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా చేపడుతామని, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. రైతులకు కూడా కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.8 వేలు జతచేసి మొత్తం రూ.14 వేలు అకౌంట్లలో వేస్తామన్నారు. రాయలసీమను హార్టికల్చర్ గా అభివృద్ధి చేస్తామన్నారు.