ప్రస్తుత కాలంలో ఆసుపత్రికి ఎటువంటి ఆరోగ్య సమస్యలతో వెళ్లిన లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ , రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ సంయుక్తంగా వ్యక్తిగత ప్రమాద బీమా పథకాలను తీసుకువచ్చాయి.
పట్టణ, గ్రామ ప్రజలకు అతి తక్కువ ప్రీమియంతో అత్యధిక భద్రత కోసం రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ (Royal Sundaram General Insurance) పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ పథకం తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ బీమా పథకం కేవలం రూ. 565, రూ. 345 ప్రీమియంతో ప్రారంభమవుతోంది.
రెండు పథకాలను పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకోవాలని సూర్యాపేట డివిజన్ నకిరేకల్ సబ్ పోస్ట్ ఆఫీస్ విధులు నిర్వహిస్తున్న సబ్ పోస్ట్ మాస్టర్ సుధాకర్ తెలిపారు. భారతీయ డాక్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB), Royal Sundaram General Insurance సంయుక్తంగా ప్రజల కోసం ఒక గొప్ప వ్యక్తిగత ప్రమాద భీమా పథకాన్ని ప్రవేశపెట్టాయి.
ఈ పథకం కేవలం తక్కువ ప్రీమియంతో, ప్రమాదాలు , అనుబంధ వైద్య ఖర్చుల నుండి మీ కుటుంబాన్ని ఆర్థికంగా రక్షిస్తుంది. ప్రీమియం బీమా మొత్తం రూ. 565 ప్రీమియానికి – రూ. 10 లక్షల బీమా కవరేజ్, రూ. 345 ప్రీమియానికి – రూ. 5 లక్షల బీమా కవరేజ్. అర్హత వయస్సు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ పథకానికి అర్హులు.
ఈ పథకంలో ముఖ్యమైన ప్రయోజనాలు ప్రత్యేకతలు చూస్తే తక్కువ ఖర్చుతో అధిక బీమా రక్షణ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి సరిపోతుంది. విద్య, వైద్యం, జీవన భద్రత వంటి కీలక అవసరాలకు కవరేజ్, ప్రజలందరూ తమ భవిష్యత్ భద్రత కోసం, తక్కువ ఖర్చుతో ఈ పథకంలో చేరవచ్చు.
ఇది ఎలా తీసుకోవాలంటే మీకు సమీపంలోని పోస్టాఫీస్ లేదా IPPB బ్యాంక్ ద్వారా ఈ పాలసీ తీసుకోవచ్చు అని తెలిపారు. 10 లక్షల పాలసీ బీమా తీసుకున్నవారు శాశ్వత అంగవైకల్యం ఏర్పడిన లేదంటే ప్రమాదశాత్తు మరణిస్తే 10 లక్షల బీమా నామిని కి వర్తిస్తుంది. ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులకు లక్ష రూపాయల వరకు ఇవ్వనుంది. పిల్లలకు 50 వేల వరకు విద్యా ప్రయోజనం ఉంటుంది.
ఐదు లక్షల పాలసీ తీసుకున్నవారు శాశ్వత అంగవైకల్యం ఏర్పడిన లేదంటే ప్రమాదశాత్తు మరణిస్తే 5 లక్షల బీమా నామినికి వర్తిస్తుంది. ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులకు 50 వేల రూపాయల వరకు ఇవ్వనుంది. పిల్లలకు 25 వేల వరకు విద్య ప్రయోజనం ఉంటుంది. చివరికి అంత్యక్రియల ఖర్చులకు కూడా 5000 రూపాయలు ఈ రెండు స్కీములకు ఇవ్వనుందని తెలిపారు.