సెకండియర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో ఓ ప్రశ్న అస్పష్టంగా ముద్రణ అయ్యింది.
దీంతో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. క్వశ్చన్ పేపర్లో అస్పష్టంగా ముద్రించిన ఏడో ప్రశ్నకు పూర్తి మార్కులు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఈ ప్రశ్నకు ఆన్సర్ రాసేందుకు యత్నించిన విద్యార్థులకు నాలుగు మార్కుల చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
సోమవారం జరిగిన సెకండియర్ ఇంగ్లీష్ పేపర్లో ఏడో ప్రశ్న ఇచ్చిన చార్ట్లో ముద్రణలో లోపం జరిగింది. దీంతో బాక్సులు అస్పష్టంగా కనిపించాయి. అవి స్పష్టంగా లేకపోవడంతో ఈ ప్రశ్నకు సరైన సమాధానం రాయలేకపోయినట్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకెల్లారు. సబ్జెక్టు నిపుణులు, ఇతరులతో చర్చించిన తర్వాత విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండాలని ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా మార్చి 5న మొదలైన ఇంటర్ పరీక్షలు 25 వరకు జరగనున్నాయి.