Govt Jobs: రూ.1.80 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం.. డిగ్రీ, డిప్లొమా ఉంటే చాలు..!

నిరుద్యోగులకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (BHEL)’, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
వీటిలో ఇంజినీర్‌ ట్రైనీ, సూపర్‌వైజర్‌ ట్రైనీ రోల్స్‌ ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెస్‌ 2025 ఫిబ్రవరి 1నే ప్రారంభమైంది. అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 28 చివరి తేదీ. అధికారిక వెబ్‌సైట్‌ https://careers.bhel.in/లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు.


ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్‌ (Educational Qualification)
BHELలో మొత్తం 400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీని విద్యార్హతలుగా నిర్ణయించారు. మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కెమికల్‌, మెటలర్జీలో డిగ్రీ చేసిన వారితో పాటు మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా పూర్తి చేసిన వారు తాజా నోటిఫికేషన్‌లో అప్లై చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు పవర్‌, ఇండస్ట్రీ, రెన్యువబుల్‌ ఎనర్జీ, ట్రాన్స్‌పోర్టేషన్‌, డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, వాటర్‌ ప్రాజెక్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ తేదీ : ఫిబ్రవరి 1
అప్లికేషన్‌ లాస్ట్‌ డేట్‌ : ఫిబ్రవరి 28
BHEL ఎగ్జామ్‌ డేట్‌ : ఏప్రిల్‌ 11-13 (Tentative)
BHEL అడ్మిట్‌ కార్డు : ఏప్రిల్‌ మొదటి వారంలో
ఏజ్‌ లిమిట్‌ : 18-27 ఏళ్లు
అప్లికేషన్‌ ఫీజు : UR/EWS/OBC : రూ.1072 (రూ.600 Exam Fee + రూ.400 ప్రాసెసింగ్‌ ఫీజు + GST) SC/ST/PWD/ESM: రూ.472 (రూ.400 ప్రాసెసింగ్‌ ఫీజు + GST)
జీతం (Salary): ఇంజినీర్‌ ట్రైనీ : రూ.50,000 – రూ.1,80,000
సూపర్‌వైజర్‌ ట్రైనీ (Supervisor Trainee) : రూ.32,000 – రూ.1,20,000

సెలక్షన్ ప్రాసెస్
ఇంజినీర్‌ ట్రైనీలకు కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. సూపర్‌వైజర్‌ ట్రైనీలకు కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, స్క్రుటినీ నిర్వహిస్తారు. కేటగరీని బట్టి వయసులో సడలింపు ఉంది. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (NCL) మూడేళ్లు, PWD విత్‌ జనరల్‌ 10 ఏళ్లు, PWD విత్‌ ఎస్సీ/ఎస్టీ 15 ఏళ్లు, PWD విత్‌ ఓబీసీ (NCL) 13 ఏళ్ల మేర ఏజ్‌ రిలాక్సేషన్‌ ఇచ్చారు.
పరీక్ష విధానం
ఎగ్జామ్‌లో టెక్నికల్‌ సబ్జెక్టుతో పాటు రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంగ్లీష్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఇంజినీర్‌ ట్రైనీ పోస్టుకు టెక్నికల్‌ సబ్జెక్టులో 120 ప్రశ్నలు 120 మార్కులు, రీజనింగ్‌లో 50 ప్రశ్నలు 50 మార్కులు, జీకేలో 20 ప్రశ్నలు 20 మార్కులు, జనరల్‌ ఇంగ్లిష్‌లో 50 ప్రశ్నలు 50 మార్కులుగా ఎగ్జామ్‌ ప్యాటర్న్‌ను డిసైడ్‌ చేశారు. మొత్తం 240 క్వశ్చన్స్‌తో 240 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 2 గంటల 30 నిమిషాలు పరీక్ష ఉంటుంది.

సూర్‌వైజర్‌ ట్రైనీ పోస్టు కోసం నిర్వహించే ఎగ్జామ్‌లో సబ్జెక్టుపై 100, రీజనింగ్‌పై 20, జీకే 10, జనరల్‌ ఇంగ్లీష్‌ 20 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 క్వశ్చన్లు, 150 మార్కులకు రాయాల్సి ఉంటుంది. సమయం 2 గంటలు. కేటగిరీల వారీగా వెకెన్సీలతో పాటు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ రిఫర్ చేయవచ్చు.