అక్కినేని హీరో నాగ చైతన్య గత ఏడాది కొత్త జీవితం స్టార్ట్ చేశాడు. ఆయన శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్నారు. హీరోయిన్ శోభిత-నాగ చైతన్య రెండేళ్లకు పైగా రిలేషన్ సాగించారు.
వారు ప్రేమలో ఉన్నారంటూ అనేక కథనాలు వెలువడ్డాయి. నాగ చైతన్య టీమ్ ఈ వార్తలను ఖండించారు. శోభిత సైతం తోసిపుచ్చింది. నాగ చైతన్య-శోభిత జంటగా ఉన్న కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టాయి. సడన్ గా 2024 ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఇక డిసెంబర్ నెలలో అన్నపూర్ణ స్టూడియో వేదికగా నిరాడంబరంగా శోభితతో నాగ చైనత్యకు వివాహం జరిగింది. శోభిత విషయంలో నాగార్జున కూడా సంతోషంగా ఉన్నారు. ఏఎన్నార్ నేషనల్ అవార్డు వేడుకలో చిరంజీవి, అమితాబ్ లకు శోభితను నాగార్జున స్వయంగా పరిచయం చేశాడు. కాగా ఈ కొత్త జంట మధ్య తండేల్ మూవీ చిన్న డిస్టబెన్స్ క్రియేట్ చేసిందట. తన భార్య నొచ్చుకుంది తండేల్ ప్రీ రిలీజ్ వేడుకలో నాగ చైతన్య ఓపెన్ గా చెప్పాడు.
శోభితను ముద్దుగా నాగ చైతన్య బుజ్జి తల్లి అని పిలుస్తాడట. ఆ బుజ్జి తల్లి పేరుతో పాట రావడంతో శోభిత ఫీల్ అయ్యిందట. ఇదే విషయం తండేల్ దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ… నా పేరు బుజ్జితల్లి, హీరోయిన్ పాత్రకు పెట్టడం వరకు ఓకే.. కానీ ఏకంగా పాట కూడా పెట్టేశారా? అని శోభిత నన్ను అడిగిందని, అన్నారు. అయితే ఇదంతా సరదాగా మాత్రమే. శోభిత తన ముద్దు పేరు సినిమాలో వాడినందుకు మరీ సీరియస్ అయిపోయి.. గొడవలకు దిగలేదు.
ఇక తండేల్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. తండేల్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించారు. పరాజయాల్లో ఉన్న నాగ చైతన్య తండేల్ మూవీపై ఆశలు పెట్టుకున్నాడు.