రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన ‘హరి హర వీరమల్లు’ హిందీ వెర్షన్ రైట్స్..విడుదలకు ముందే ‘దేవర’, ‘కల్కి’ అవుట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో ఒకటి ‘హరి హర వీరమల్లు’. రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్, ఇలాంటి భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ ని ఒప్పుకోవడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.


అయితే మధ్యలో కరోనా రావడం, లాక్ డౌన్ విధించడం వల్ల చాలా కాలం వరకు షూటింగ్ కార్యక్రమాలను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. లాక్ డౌన్ తర్వాత ఈ చిత్రానికి దాదాపుగా 50 రోజుల వరకు షూటింగ్ జరిగింది. 70 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం. మిగిలిన భాగాన్ని పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సెప్టెంబర్ నెల నుండి షూటింగ్ ని మళ్ళీ ప్రారంభించారు. ఇప్పుడు చివరి దశలో ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించి వారం రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది.

వచ్చే వారం లో ఆయన ఈ బ్యాలన్స్ భాగాన్ని పూర్తి చేయవచ్చు. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదలైన ‘మాట వినాలి’ అనే లిరికల్ వీడియో సాంగ్ సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు తో పాటు అన్ని భాషల్లోనూ పవన్ కళ్యాణ్ ఈ పాటకు తన గాత్రాన్ని అందించాడు. మార్చి 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో లీకైన ఒక వార్త సెన్సేషనల్ గా మారింది. అదేమిటంటే ఈ చిత్రానికి సంబంధించిన హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని అనిల్ తథాని 50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడట. రీసెంట్ గా విడుదలైన ‘దేవర’, ‘గేమ్ చేంజర్’ థియేట్రికల్ రైట్స్ కంటే ‘హరి హర వీరమల్లు’ ఎక్కువ రేట్ కి అమ్ముడుపోవడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఇది మొదటి పాన్ ఇండియన్ చిత్రం. మొదటి సినిమాకే ఈ స్థాయి బిజినెస్ అనేది ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరోకి కూడా జరగలేదు. ప్రతీ సినిమాని కొనేముందు పూర్తి సినిమాని ముందుగా చూసే అలవాటు ఉన్న అనిల్ తథాని, ఈ సినిమా ఔట్పుట్ ని కూడా చూసే కొనుగోలు చేశాడట. దీనిని బట్టి ఈ సినిమా రేంజ్ ఏమిటి అనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ కంటెంట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కానీ కలర్ గ్రేడింగ్ పట్ల చిన్న అసంతృప్తి ఉండేది. మనోజ్ పరమహంస వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కంప్లైంట్ కూడా రావడం లేదు. మొన్న విడుదల చేసిన పాటలో కలర్ గ్రేడింగ్ అండ్ విజువల్స్ అదిరిపోయాయని అభిమానులు అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ కంటెంట్ తో ఇంకా ఎంత అంచనాలను పెంచబోతుంది అనేది.