జపనీస్ సీక్రెట్ వాటర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ డ్రింక్ జపనీయుల ఆరోగ్యం, అందమైన చర్మం రహస్యంగా పరిగణించబడుతుంది. అల్లం, నిమ్మరసం (Ginger Infused Lemon Water)తో ఈ జపనీస్ సీక్రెట్ డ్రింక్ తయారుచేయబడతుంది.
ఈ పానీయం శతాబ్దాలుగా జపాన్‌లో వినియోగించబడింది. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఈ పానీయం మీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగకరంగా ఉంటుంది, దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
నేచురల్ గా పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది
బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నవాళ్లు రెగ్యులర్ గా జపనీస్ సీక్రెట్ వాటర్ తీసుకుంటే చాలా మంచిది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని కరిగించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అల్లంలో జింజెరోల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి,ఇవి జీవక్రియను పెంచడానికి, పొత్తికడుపు ప్రాంతంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. మరోవైపు, నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వు అణువులను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. 2020 నాటి ఓ రీసెర్చ్ ప్రకారం అల్లం నీరు తాగడం వల్ల రక్తంలోని కొవ్వులు గణనీయంగా తగ్గుతాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
బరువు తగ్గుతారు
బరువు తగ్గడంలో జపనీస్ సీక్రెట్ వాటర్ చాలా సహాయపడుతుంది. అల్లం మంచిగా డైజేషన్ అవడానికి సహాయపడుతుంది. సంతృప్తి స్థాయిలను మెరుగుపరచడం ద్వారా ఆకలిని తగ్గిస్తుంది. ఎక్కువసమయం పాటు కడుపు ఫుల్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో పదే పదే తినడం తగ్గిస్తారు. నిమ్మరసం డీటాక్సిఫికేషన్ కు సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఈ ప్రభావాన్ని పెంచుతుంది, కొవ్వులను జీవక్రియ చేసే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్యాలెన్స్డ్ డైట్ తో పాటుగా ఈ జపనీస్ సీక్రెట్ డ్రింక్ ని రెగ్యులర్ గా తాగడం వల్ల ఎక్కువ బరువు పెరగకుండా ఉంటారు.
బీపీ కంట్రోల్
సాధారణ పద్దతిలో బీపీని తగ్గించాలకుంటే ఈ జపనీస్ సీక్రెడ్ డ్రింక్ చాలా సహాయపడుతుంది. అల్లం రక్త ప్రసరణను పెంచే సామర్థ్యాలకు ప్రసిద్ధి, రక్త నాళాలను సడలించడంలో సాయపడుతుంది. ఈ రెండూ బీపీని తగ్గించడంలో సాయపడుతుంది. నిమ్మకాయలోని పొటాషియం గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
ఈ ఉపయోగాలు కూడా
అంతేకాకుండా ఈ జపనీస్ సీక్రెట్ వార్ శరీరానికి సున్నితమైన డీటాక్సిఫైర్ గా పనిచేస్తుంది. చర్మం స్పష్టతను పెంచుతుంది మరియు శక్తి స్థాయిలను పెంచుతుంది. జీర్ణ సంబంధిత లేదా అరుగుదల సమస్యలను తగ్గిస్తుంది.
జపనీస్ సీక్రెట్ వాటర్ ఎలా తయారు చేయాలి?
-ఒక ఇంచు ప్రెష్ అల్లం ముక్కను తీసుకుని 1.5 కప్పు వాటర్ లో 5-7 నిమిషాలు ఉడకబెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-వేడి తగ్గే దాకా దాన్ని అలాగే ఉంచండి.
-తర్వాత ఒక దబ్బ నిమ్మరసం అందులో పిండి బాగా కలిపితే చాలు. జపనీస్ సీక్రెట్ వాటర్ రెడీ.