Ration card: రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయా? కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనుందా? ఇప్పటి వరకు అమలులో ఉన్న విధానాన్ని మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారా? అవుననే సమాధానం వినిపిస్తోంది.
Ration card: రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయా? కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనుందా? ఇప్పటి వరకు అమలులో ఉన్న విధానాన్ని మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారా? అవుననే సమాధానం వినిపిస్తోంది. మరి, ఈ మార్పులు ఏమిటి? ప్రజలకు కలిగే ప్రయోజనాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
రేషన్ వ్యవస్థ లక్ష్యం: పేద, మధ్య తరగతి కుటుంబాలకు పోషకాహారం అందించడమే రేషన్ వ్యవస్థ లక్ష్యం. ప్రభుత్వ పథకాలలో రేషన్ కార్డు ప్రామాణికంగా ఉపయోగిస్తారు. అయితే, త్వరలోనే రేషన్ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని సమాచారం.
కరోనా ప్రభావం –: కరోనా సమయంలో చాలా మంది ఉపాధి కోల్పోయారు. అప్పుడు రేషన్ వ్యవస్థ ఎంతో మందికి అండగా నిలిచింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందించడం వల్ల ఎంతో మంది లబ్ధిపొందారు. ప్రస్తుతం కూడా ఉచితంగా బియ్యం పంపిణీ కొనసాగుతోంది.
రేషన్ పై ఆసక్తి తగ్గుతున్న మధ్య తరగతి: ఇదిలా ఉండగా, రేషన్ తీసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలు రేషన్ సరుకులపై ఆసక్తి చూపడం లేదు. కొందరు తీసుకున్న బియ్యాన్ని అమ్మేస్తున్నారు.
రేషన్‌కు బదులుగా నగదు – కేంద్రం ఆలోచన: ఈ పరిస్థితుల్లో, రేషన్ విధానాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై రేషన్ సరుకుల స్థానంలో నేరుగా నగదు ఇవ్వాలని యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ, దీనిపై కేంద్రం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
నీతి ఆయోగ్ సమావేశంలో చర్చ: ఇటీవల నీతి ఆయోగ్ సమావేశంలో ఈ విషయంపై చర్చించారు. రేషన్‌పై ఆధారపడే కుటుంబాలకు నిత్యావసరాల స్థానంలో నగదు ఇస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలించారు. ప్రజలకు నిజంగా లాభమా? అనే ప్రశ్న కూడా ముందుకు వచ్చింది.
నగదు విధానం – లాభమా? నష్టమా?: రేషన్‌కు బదులుగా నగదు ఇవ్వడం వల్ల ప్రజలకు నిజంగానే ఉపయోగమా? ఎంత మొత్తం ఇస్తారు? అది రేషన్ సరుకులకు సమానమా? అనే సందేహాలు ఉన్నాయి. అయితే, కేంద్రం నగదు పంపిణీ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి విధివిధానాలు త్వరలో వెల్లడికానున్నాయి.