Gas ATM | కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. గ్యాస్ ఏటీఎంలు వచ్చేశాయి. మీరు సులభంగానే ఎప్పుడైనా ఇంటికి ఎంతైనా గ్యాస్ తెచ్చుకోవచ్చు.
LPG Cylinder | ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరిపోయే శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా.. కొత్త సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. దీని వల్ల సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ అవి ఏ సేవలు, ఎలా ఉపయోగపడతాయి? వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా అయితే మనం గ్యాస్ సిలిండర్ పొందాలంటే.. బుక్ చేసుకోవాలి. బుకింగ్‌కు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఫోన్ చేసి లేదంటే యాప్ ద్వారా సిలిండర్ బుక్ చేయొచ్చు. తర్వాత సిలిండర్ మనకు డెలివరీ అవుతుంది. 1-2 రోజులో రావొచ్చు. లేదంటే ఇంకా ఆలస్యం కావొచ్చు. డిమాండ్ ఆధారంగా డెలివరీ మారొచ్చు.
అయితే ఇకపై సిలిండర్ బుకింగ్ చేసుకోవాల్సిన పని లేదు. మీరు సిలిండర్ నేరుగా వెళ్లి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఎల్‌పీజీ ఏటీఎంలు రాబోతున్నాయి. అదేంటి బ్యాంక్ ఏటీఎంలు, గోల్డ్ ఏటీఎంలు చూశాం. కానీ ఎల్‌పీజీ ఏటీఎంలు ఏంటి? అని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ఈ సేవలు తీసుకువస్తోంది. ఇప్పటికే బెంగళూరులో ఈ సేవలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఆవిష్కరించారు. ఎల్‌పీజీ ఏటీఎం సేవల ద్వారా మీరు ఎప్పుడైనా సిలిండర్ పొందొచ్చు.
రానున్న కాలంలో ఈ సేవలు ప్రధాన పట్టణాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారత్ గ్యాస్ ఇన్‌స్టా పేరుతో మీరు ఎల్‌పీజీ ఏటీఎం సేవలు పొందొచ్చు. వీటిల్లో 5 కేజీ, 10 కేజీ సిలిండర్లు అందుబాటులో ఉండనున్నాయి.
అంటే మీరు మీ సిలిండర్ తీసుకువెళ్లి గ్యాస్ నింపుకోవచ్చు. మీకు ఎంత గ్యాస్ కావాలంటే అంత నింపుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉండొచ్చు. ఏఐ టెక్నాలజీ, సెన్సార్లు ద్వారా ఇవి పని చేస్తాయి.
అందువల్ల లీకేజీ సమస్యలు ఉండవు. తొలిగా ఈ సేవలు బెంగళూరు, జైపూర్, నుమలిఘర్ (అస్సాం), ముంబైలో అందుబాటులోకి రానున్నాయి. ఎల్‌పీజీ ఏటీఎంలలో డిజిటల్ పేమెంట్ చేయొచ్చు.
కాగా బీపీసీఎల్ దారిలోనే హెచ్‌పీసీఎల్, ఇండేన్ వంటి కంపెనీలు కూడా నడిచే అవకాశం ఉంది. దీని వల్ల సిలిండర్ వినియోగదారులు అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.