Spam Calls: స్పామ్‌ కాల్స్‌పై ట్రాయ్‌ కీలక నిర్ణయం.. కంపెనీలకు కఠినమైన ఆదేశాలు

Spam Calls: టెలికం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, అలాగే వినియోగదారుల భద్రతను పెంచడానికి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనలను సవరించింది. స్పామ్ కాల్‌లు మొబైల్‌ వినియోగదారులకు పెద్ద సమస్యగా మారింది. గత సంవత్సరం చివర్లో ట్రాయ్ ఈ స్పామ్ కాల్‌లను ఆపడానికి కఠినమైన ఆదేశాలు జారీ చేసింది..
స్పామ్ కాల్‌లు మొబైల్‌ వినియోగదారులకు పెద్ద సమస్యగా మారింది. గత సంవత్సరం చివర్లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఈ స్పామ్ కాల్‌లను ఆపడానికి కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్డర్ తర్వాత స్పామ్ కాల్స్ సంఖ్య తగ్గింది. కానీ పూర్తిగా ఆగలేదు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కఠినమైన చర్యలు తీసుకోవలసి వచ్చింది.


స్పామ్ కాల్స్ ఆపకపోతే లేదా కస్టమర్లకు అలాంటి కాల్స్ పదే పదే వస్తే, టెలికాం కంపెనీలు ప్రమాదంలో పడతాయి. టెలికాం నియంత్రణ అధికారులు ఇప్పటికే టెలికాం కంపెనీలను హెచ్చరించారు. స్పామ్ కాల్ రికార్డుల గురించి టెలికాం కంపెనీ తప్పుడు సమాచారం ఇస్తే, జరిమానా రూ.2 లక్షల నుండి రూ.10 లక్షల వరకు ఉంటుంది.

టెలికాం ఆపరేటర్లు ఫోన్ కాల్స్, SMS లను సమీక్షించాల్సి ఉంటుందని TRAI స్పష్టం చేసింది. అలాగే ఎక్కడ ఎక్కువ కాల్స్ వస్తున్నాయి..? ఎక్కడ ఫోన్ కాల్ సమయం తక్కువగా ఉంటుంది. దీనివల్ల టెలికాం కంపెనీలు అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్‌లను పరిశోధించడం ద్వారా మోసగాళ్లను గుర్తించాల్సి ఉంటుంది.

టెలికాం కంపెనీలు TRAI ఆదేశాన్ని ఉల్లంఘిస్తే, మొదటి ఉల్లంఘనకు రూ.2 లక్షలు, రెండవ ఉల్లంఘనకు రూ.5 లక్షలు, తదుపరి ఉల్లంఘనకు రూ.10 లక్షల జరిమానా విధించనుంది ట్రాయ్‌. అందుకు స్పామ్స్‌ కాల్స్‌ విషయంలో ట్రాయ్‌ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తుగానే స్పామ్స్‌ కాల్స్‌ను గుర్తించాలని సూచిస్తోంది.

TRAI ఇటీవల టెలికాం కంపెనీలను కనీసం రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాలని ఆదేశించింది. 365 రోజుల చెల్లుబాటుతో కూడిన రీఛార్జ్‌ను తప్పనిసరి చేయాలని కూడా TRAI ఆదేశించింది. రెండు సిమ్‌లు ఉన్నవారికి టెలికాం కంపెనీలు వాయిస్ ప్లాన్ రీఛార్జ్ సౌకర్యాన్ని అందించాల్సి ఉంటుందని చెబుతున్నారు.