కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్(KCR) గురువారం తీవ్ర అనారోగ్యం(Illness) పాలైన సంగతి తెలిసిందే. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


కాగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రి వైద్యుల బృందం హెల్త్ బులిటెన్(Health Bulliten) విడుదల చేసింది. తీవ్ర జ్వరంతో కేసీఆర్ ఆసుపత్రిలో చేరారని, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగినట్టు తేలిందన్నారు. అలాగే సోడియం లెవెల్స్ కూడా భారీగా పడిపోయాయని పేర్కొన్నారు.

మిగిలిన అన్ని టెస్టులు నార్మల్ గానే వచ్చాయని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపిన వైద్యులు.. క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉంచి, చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.