Holiday: విద్యార్థులకు ఎగిరిగంతేసే శుభవార్త.. ఆ రోజు స్కూళ్లకు సెలవు

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్కూళ్లకి(School), కాలేజీ(College)లకు ఆ రోజు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.


తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్(Calendar) ప్రకారం ఫిబ్రవరి 14న షబ్-ఎ-బరాత్ నిర్వహించబడుతుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14వ తేదీన షబ్-ఎ-బరాత్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సెలవు ప్రకటించింది. నెలవంక కనిపించడంతో ఆరోజున షబ్-ఎ-బరాత్ నిర్వహించాలని మత పెద్దలు ఖరారు చేశారు.

అయితే ఇది సాధారణ సెలవు దినం కాకుండా ఆప్షనల్ హాలిడే(Optional Holiday)గా పేర్కొంది. ఫిబ్రవరి 14న కొన్ని పాఠశాలలకు సెలవు(Holiday) ఉండగా మరికొన్ని మైనారిటీ స్కూళ్లు మరుసటి రోజు సెలవు పాటిస్తాయి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే వర్తించనుంది. షబ్-ఎ-బరాత్‌న ముస్లిం అందరూ ఒక పవిత్రమైన దినంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎంతో గొప్పగా జరుపుకుంటారు. ఇక ఆ రోజు రాత్రంతా మస్జిద్‌లో దీపాలతో అలంకరణ చేస్తారు. అంతేకాదు మస్జీద్‌ల్లో ప్రార్థనలు నిర్వహిస్తారు.