Horse Gram Health Benefits: ఉలవలతో కరుగును రాళ్లు..! ఎంత పనిచేసినా అలసట రావొద్దంటే వీటిని తినండి

www.mannamweb.com


ఉలవలను ఉడికించి లేదా మొలకెత్తించి కూడా తీసుకోవచ్చు. ఇవి అనేక రోగాలను నివారిస్తాయి. శరీరంలోని గ్లూకోజ్ ను అదుపు చేయడంలో ఉలవలు ఎంతో మేలు చేస్తాయి.

ఇదే కాదు ఉలవలు బీపీని కూడా అదుపులో ఉంచుతాయి. రక్తహీనతతో బాధపడేవారు తరచూ ఉలవలను కషాయంగా కాని, చారు రూపంలా గాని తీసుకుంటే శరీరంలో కొత్త రక్తం వస్తుంది. ఉలవల్లో ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని ఇచ్చి నీరసం, నిసత్తువను తగ్గిస్తాయి. ఎదిగే పిల్లలకు వారి శరీర నిర్మాణం చక్కగా ఉండేందుకు ఉలవలు ఎంతో మేలు చేస్తాయి.

కిడ్నీలో రాళ్లను నయం చేయడానికి ఉలవలను ఉపయోగించవచ్చు. ఇది ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు, స్టెరాయిడ్లు మరియు సపోనిన్లు వంటి అనేక ఫైటోకెమికల్స్‌ను కలిగి ఉంటుంది. కిడ్నీ సమస్యలను నివారించడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలోని పోషకాలు కిడ్నీ రాళ్లు ఏర్పడకుండా కాపాడతాయి. రోజూ ఉదయాన్నే ఉలవల నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి.

పెరిగే పిల్లలకు ఉలవలు తినిపిస్తే చాలా మంచిది. ఇవి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలలో సహాయపడతాయి. వారిని బలంగా ఉంచుతాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తీసుకోవడం చాలా మంచిది. ఉలవలు తినడం ద్వారా ఎక్కిళ్లు రాకుండా ఉంటాయి. బరువు ఎక్కువగా ఉన్నవారు ఉలవలు తింటే చాలా మంచిది. వీటిలోని ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంచుతుంది.

ఉలవల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కండరాల కదలికల్ని మెరుగుపరుస్తుంది. తద్వారా మలం సాఫీగా వచ్చేలా చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఓ కప్పు ఉలవ చారుకు సమానంగా కొబ్బరి నీళ్లు తీసుకుంటే మూత్రంలో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. తరచూ మూత్రంలో మంటతో బాధపడేవారు ఈ చిట్కా ట్రై చేయండి.

రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వులను కరిగించడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. తద్వారా గుండెకు రక్తసరఫరా మెరుగుపర్చి హృదయ సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి. జ్వరంతో పాటు ఆయాసం, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు ఉలవల కషాయం తాగడం మంచిది. ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఉలవలు శరీరంలో ఉన్న వేడిని హరిస్తాయి. వాతం, శ్వాస, మూలవ్యాధి, ఖఫం తగ్గించడం వంటి వాటికి ఉలవలు ఎంతో ఉపయోగపడతాయి. రుతు సమస్యలను నివారిస్తుంది. ఉలవలలోని ఐరన్, ఫాస్ఫరస్ ఎనీమీయాను నివారిస్తాయి. ఇందులోని కాల్షియం ఎముకులకు, కండరాలకు శక్తినిస్తుంది. ఇక ఇందులోని ఫైబర్ మలబద్దకం రాకుండా అడ్డుకుంటుంది.