అసలు దేవాలయంలో ఎన్ని సార్లు ప్రదక్షిణ చేయాలి?

చాలా మంది పూజ చేస్తుంటారు. ఇంట్లో పూజ చేసినప్పుడు ఎక్కువగా ప్రదక్షిణలు చేయరు. కానీ గుడికి వెళ్తే మాత్రం కచ్చితంగా ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక మొక్కును బట్టి కొందరు మూడు, ఐదు, పదకొండు, 21 చేస్తారు. మరికొందరు ఏకంగా 108 ప్రదక్షిణలు చేస్తుంటారు కూడా. ఇంతకీ ఆలయానికి వెళ్లినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఎన్ని చేస్తే మంచిది వంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


పూజ తర్వాత, ఏదైనా ఆలయంలో విగ్రహాన్ని ప్రదక్షిణ చేయాలి అనుకుంటే మంచిదే. కానీ ఎక్కువగా చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు పండితులు. ఇలా చేయడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, మనకు ఆశీర్వాదం ఇస్తుందని నమ్ముతారు. కానీ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఎన్ని చేయడం వల్ల మంచి జరుగుతుంది అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమే.

ప్రదక్షిణ చేయడం ప్రాముఖ్యత ఏమిటి?
ఆలయంలో ప్రదక్షిణలు చేయడం ద్వారా, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇలా ఏ ఆలయంలో ప్రదక్షిణలు చేసినా సరే ఆ దేవతల అనుగ్రహంతో మీరు ఇబ్బందుల నుంచి విముక్తి పొందుతారు. దీనితో పాటు, మీ ధైర్యం పెరుగుతుంది. శివయ్య, గణపతి, మనుమాన్, రాముల వారు ఇలా ఏ దేవుడి గుడికి వెళ్లినా సరే మీరు ప్రదక్షిణలు చేయవచ్చు.

ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయాలి?
హనుమాన్ జీ విగ్రహాన్ని ప్రదక్షిణ చేస్తే, మీరు సంకటమోచన్ హనుమాన్ మంత్రాన్ని జపించాలి. లేదా శివాలయంలో ప్రదక్షిణ చేస్తే ఆ శివనామస్మరణం చేస్తూ ప్రదక్షిణలు కంప్లీట్ చేయాలి. అంతే కానీ లెక్క పెడుతూ దేవుడి మీద భక్తిని కాస్త లెక్క మీదికి మల్చడం వల్ల ప్రయోజనం ఉండదు అంటున్నారు పండితులు. అయితే ఈ ప్రదక్షిణ తర్వాత, మీరు హనుమాన్ చాలీసాను కూడా పఠించవచ్చు. ప్రదక్షిణల సంఖ్య గురించి చెప్పాలంటే, హనుమాన్ జీని మూడుసార్లు ప్రదక్షిణ చేయడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇతర ఆలయాల్లో కూడా మూడు సార్లు మాత్రమే ప్రదక్షిణ చేయాలి. ఈ సంఖ్యలో ప్రదక్షిణ చేయడం సరిపోతుంది అంటున్నారు పండితులు.

ప్రదక్షిణ చేసిన తర్వాత ఏమి చేయాలి?
మీరు హనుమాన్ జీ ఆలయానికి వెళ్లి పూజ తర్వాత ప్రదక్షిణ చేసినప్పుడల్లా, మీరు శ్రీరాముడిని స్తుతించాలి. ఎందుకంటే, హనుమాన్ జీ శ్రీరామునికి ప్రత్యేకమైన భక్తుడు. ఇది ఆయనను అత్యంత సంతోషపరుస్తుంది. దీనితో పాటు, మీరు హనుమాన్ జీ పాదాల వద్ద 07 రావి ఆకులను సమర్పించాలి. ఇది మంచి ఫలాలను ఇస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.