‘ఐ బొమ్మ’లో కొత్త సినిమాలు..ఆ సినిమా మాత్రం అసలు మిస్ కావొద్దు

ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్‌లైన్‌లో చూడడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్‌సైట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది.


అయితే, ఇది చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం చేస్తుంది. ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్‌బస్టర్‌లు, క్లాసిక్ హిట్స్, చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట చూడవచ్చు.

దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలను ఉచితంగా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది: సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు. తాజాగా ఐ బొమ్మలో కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. ఉపేంద్ర నటించిన ‘యూఐ’, విజయ్ సేతుపతి నటించిన ‘విడుదల-2’, అల్లరి నరేష్ నటించిన ‘బచ్చలమల్లి’,సిద్దార్ద్ ‘మిస్ యూ’, బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు నటించిన ‘రామ్ నగర్ బన్నీ’ సినిమా కూడా ఐ బొమ్మలో సందడి చేస్తున్నాయి.

వీటితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు సైతం ఐ బొమ్మలో దర్శనం ఇచ్చాయి. ‘ఫీయర్’, ‘పని’,’సూక్ష్మ దర్శని’,’మార్క్’ వంటి డబ్బింగ్ సినిమాలు ఐ బొమ్మలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో ముఖ్యంగా బాసిల్ జోసెఫ్,నజ్రియా నజీమ్ జంటగా నటించిన ‘సూక్ష్మ దర్శని’ సినిమా ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. క్రైమ్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన సూక్ష్మ దర్శని సినిమా మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది.