ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. గతంలో ఎన్నడూలేని రీతిలో రాయలసీమలో కూటమి సర్కార్ అత్యధికంగా 37 సీట్లను కూటమి పార్టీలు గెలుచుకున్నాయి.
ఇందులో కడప జిల్లాలోనూ నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి.. వైఎస్ జగన్ ఇలాకాలో టీడీపీ ఇన్ని సీట్లు గెలవడం ఇదే తొలిసారి.. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచేసరికి అప్పుడే కొందరు ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత మొదలైనట్టు తెలుస్తోంది. తాజాగా ఓ సర్వే సంస్థ రాయలసీమలో ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూసినట్టు తెలుస్తోంది..
ప్రస్తుతం రాయలసీమలో కూటమి పార్టీల నుంచి 37 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలే 29 మంది ఉన్నారు. వీరిలో అందరిపైన ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో నలుగురు మంత్రులు కూడా రెడ్‌జోన్‌లో ఉన్నారట. వీరి పనితీరు అస్సలు బాగలేదట. మరోవైపు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నలుగురు మంత్రులు అట్టర్‌ఫ్లాప్ అయ్యారని చెబుతున్నారు. అయితే గెలిచిన 90 మంది ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు కూడా అదేస్థాయిలో ఉన్నాయట. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం.. చిత్తూరు పార్లమెంటులో కుప్పం, పలమానేరు తప్పితే… మిగిలినవి కూటమి పార్టీలు మార్చిపోవడమే బెటర్ అని సర్వేలో తేలినట్టు సమాచారం..
ఇటీవల కడపలో టీడీపీ మహానాడు అట్టహాసంగా జరిగింది. మహానాడుకు లక్షలాది మంది తెలుగుతమ్ముళ్లు తరలివచ్చారు. ఇదే మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు.. వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో అన్ని సీట్లు గెలవాలని నేతలకు దిశానిర్ధేశం చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను ముందే పసిగట్టిన సీఎం చంద్రబాబు పనితీరు మార్చుకునేలా ఇలా మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం చెప్పిన నెలరోజులలోపే ఇప్పుడు సర్వే రూపంలో వ్యతిరేకత మొదలైందనే టాక్ వచ్చింది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈస్థాయిలో వ్యతిరేకత రావడం వెనుక రకరకాల కారణాలు ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది..
ఇక కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రైల్వే కోడూరు సీటు జనసేనకు కేటాయించడంతో.. అరవ శ్రీధర్‌ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన పనితీరు చాలా దారుణంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ నేతలదే పెత్తనంలా పాలన నడుస్తోందట. టీడీపీ ఇంచార్జ్ ఏదీ చెబితే దానికి ఎమ్మెల్యే హు కొడుతున్నారట. అయితే పేరుకు ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ ఉన్నారని.. పెత్తనమంతా టీడీపీ చేతుల్లో ఉండటంతో.. ఆయన వన్‌టైమ్ ఎమ్మెల్యేగా మిగిలిపోయే అవకాశం ఉందని సర్వేలో తేలిందట. మరోవైపు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం అర్భన్ ఎమ్మెల్యేగా దగ్గుబాటి ప్రసాద్ గెలిచారు. అక్కడ సీనియర్ లీడర్ సుధాకర్ నాయుడిని పక్కన పెట్టిన టీడీపీ హైకమాండ్.. దగ్గుబాటికి టికెట్ ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహంతో ఆయన రగిలిపోతున్నారు. అటు పార్టీ పుట్టినప్పటీ నుంచి నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కాదని తనకు భజన చేసే వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు కడప జిల్లా ఎమ్మెల్యేల పనితీరుపైన సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డట్టు సమాచారం. ప్రస్తుతం కడప జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. వీరంతా కేవలం ప్రచారానికి పరిమితం అయ్యారని అంటున్నారు. ఇప్పుడు ఈ నలుగురిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని సమాచారం. మరోవైపు రాయలసీమ కూటమిలో వైసీపీ నేతలే ఎక్కువగా ఉండటంతో.. కూడా వ్యతిరేకత పెరిగిందని తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారమంతా అనుభవించిన నేతలు.. ఎన్నికలకు ముందు పార్టీ మారారు. దాంతో వీరిపై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేలో తేలిందట. మొత్తంమీద రాయలసీమలోని ఎస్సీ నియోజకవర్గాలన్నీ వైసీపీ వైపు చూస్తున్నట్టు సర్వేలో బయటపడినట్టు తెలుస్తోంది.