మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. ఈ దేశాలు సేఫ్‌

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు మూడవ ప్రపంచయుద్ధానికి దారితీసేలా ఉన్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇరు దేశాల మధ్య నెలకొన్న అస్థిర వాతావరణం..


ఒకవేళ ప్రపంచ యుద్ధానికి దారితీస్తే, మిత్రదేశాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మూడవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రజలకు ఆశ్రయం కల్పించేలా కొన్ని దేశాలున్నాయి. ఆయా దేశాల్లోని భౌగోళిక, రాజకీయ స్థితిగతులు, సైనిక తటస్థత , స్థిరమైన పరిస్థితుల కారణంగా సురక్షితమైన ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ‘ది మెట్రో’ తెలిపిన వివరాల ప్రకారం ఆ దేశాలు ఇవే..

అంటార్కిటికా
అణు యుద్ధం జరిగిన పక్షంలో అంటార్కిటికా అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. అణు శక్తులకు ఈ ప్రాంతం చాలా దూరంలో ఉంది. దేశంలోని 14 మిలియన్ చదరపు కిలోమీటర్ల ప్రాంతం నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడి మంచుతో కూడిన వాతావరణం మనుగడకు సవాలుగా నిలుస్తుంది.

ఐస్లాండ్
అత్యంత శాంతియుత దేశాలలో ఒకటిగా, స్థిరమైన ర్యాంక్‌తో ఐస్లాండ్ గుర్తింపు పొందింది. ఐస్లాండ్ పూర్తి స్థాయి యుద్ధంలో ఎప్పుడూ పాల్గొనలేదు. దేశ భౌగోళిక స్థానం యుద్ధాలకు తక్కువ అవకాశమిస్తుంది. అయితే అణుయుద్ధం నుంచి రక్షణ కల్పించడంలో అంత అనువైన దేశం కాదు.

న్యూజిలాండ్
తటస్థ వైఖరితో గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో రెండవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్.. ఇక్కడ పర్వత భూభాగాల కారణంగా రక్షణను అందిస్తుంది. ఈ దేశం ఉక్రెయిన్‌కు ఆర్థికంగా మద్దతు ఇచ్చింది.

స్విట్జర్లాండ్
రెండవ ప్రపంచ యుద్ధంలో స్విట్జర్లాండ్ తటస్థతంగా వ్యవహరించింది. ఇక్కడి పర్వత ప్రాంతాలు యుద్ధాల నుంచి రక్షణ కల్పిస్తాయని నిపుణులు చెబుతుంటారు. దేశ రాజకీయ తటస్థ వైఖరి కారణంగా దాడులకు అవకాశం తక్కువ.

గ్రీన్లాండ్
ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపంగా గ్రీన్లాండ్ పేరొందింది. దేశ రాజకీయ తటస్థత.. యుద్ధ భయాలను దూరం చేసేదిగా ఉంది. 56 వేల మంది జనాభా మాత్రమే కలిగిన ఈ దేశంలో సంఘర్షణలకు ఆస్కారం చాలా తక్కువని చెబుతుంటారు.

ఇండోనేషియా
ఇండోనేషియా నిరంతరం ప్రపంచ శాంతికి ప్రాధాన్యతనిస్తూ, తటస్థ విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుంది. దేశ స్వతంత్ర వైఖరి, భౌగోళిక రాజకీయ స్థానం మొదలైనవి ఈ దేశాన్ని ప్రపంచ సంఘర్షణలవైపు చూసేలా చేయనివ్వవు.

తువాలు
కేవలం 11 వేల మంది జనాభా కలిగిన చిన్న ద్వీప దేశమిది.ఇక్కడి పరిమిత మౌలిక సదుపాయాలు, వనరులు యుద్ధ పరిస్థితులకు తావులేనివిధంగా ఉన్నాయి. హవాయి, ఆస్ట్రేలియా మధ్య ఉన్న ఈ దేశం అత్యంత సురక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందింది.

అర్జెంటీనా
అర్జెంటీనాకు సంఘర్షణల చరిత్ర ఉన్నప్పటికీ, ఇక్కడి వ్యవసాయ వనరుల కారణంగా ఇది సాపేక్షంగా సురక్షితమైన దేశంగా పేరొందింది.

భూటాన్
1971లో తటస్థతను ప్రకటించినప్పటి నుండి భూటాన్ సురక్షితంగా ఉంటోంది. దేశంలోని పర్వత భూభాగం యుద్దాల నుంచి రక్షణను అందిస్తుంది. దేశ భౌగోళిక స్వరూపం బాహ్య ముప్పుల సులభంగా తప్పించుకునే విధంగా ఉంది.

చిలీ
నాలుగు వేల మైళ్ల విస్తీర్ణంలో ఉన్న చిలీ.. విస్తారమైన తీరప్రాంతాన్ని, సమృద్ధిగా ఉన్న సహజ వనరులను కలిగివుంది. ఇది ప్రజలకు భద్రతను, స్థిరత్వాన్ని అందిస్తుంది. దక్షిణ అమెరికాలోని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాలలో చిలీ ఒకటిగా నిలిచింది.

ఫిజీ
ఆస్ట్రేలియాకు 2,700 మైళ్ల దూరంలో ఫిజీ ఉంది. దట్టమైన అడవులు ఈ దేశాన్ని శాంతియుత ప్రాంతంగా మార్చాయి. గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో ఫిజీ తన ర్యాంక్‌ను కాపాడుకుంటూ వస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.