నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి మనం తెలుసుకుందాం.
ఢిల్లీ, ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 53
ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో జాయింట్ డైరెక్టర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ (అకడమిక్స్), ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు..
1. జాయింట్ డైరెక్టర్: 02
2. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్: 02
3. డిప్యూటీ డైరెక్టర్(అకడమిక్స్): 02
4. డిప్యూటీ డైరెక్టర్(కార్పొరేట్ కమ్యూనికేషన్): 01
5. ఐటీ సెక్యూరిటీ మేనేజర్: 01
6. ఎగ్జిక్యూటివ్: 03
7. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: 10
8. డీన్: 04
9. రీసెర్చ్ అసోసియేట్: 20
10. ఎగ్జిక్యూటివ్(కెరియర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్): 04
11. అకౌంటెంట్: 04 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఐసీఎస్‌ఐ/ఐసీఏఐ/ఐసీఏఐ, ఎంసీఏ లేదా బీటెక్(ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్‌సైన్స్), డిగ్రీ(కామర్స్), ఏసీఎస్/ఏసీఏ/ఏసీఎంఏ లేదా 50 శాతం మార్కులతో పీజీ(ఎకనామిక్స్/కామర్స్/ మేనేజ్‌మెంట్/లా) లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 2025 మే 1వ తేదీ నాటికి జాయింట్ డైరెక్టర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు 50 ఏళ్లు, డిప్యూటీ డైరెక్టర్, ఐటీ సెక్యూరిటీ మేనేజర్, రీసెర్చ్ అసోసియేట్, ఎగ్జిక్యూటివ్(కెరియర్ అవేర్‌నెస్), అకౌంటెంట్‌కు 40 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు, డీన్‌కు 62 ఏళ్ల వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రీసెర్చ్ అసోసియేట్, ఎగ్జిక్యూటివ్, అకౌంటెంట్‌కు రూ.50,000, డీన్‌కు రూ.2,50,000, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌కు రూ.25,500 – రూ.81,100, ఎగ్జిక్యూటివ్(లా/ఫైనాన్స్ అండ్ అకౌంట్స్/హెచ్‌ఆర్)కు రూ.47,600 – రూ.1,51,100, ఐటీ సెక్యూరిటీ మేనేజర్‌కు రూ.56,100 – రూ.1,77,500, డిప్యూటీ డైరెక్టర్‌కు రూ.67,700 – రూ.2,08,700, జాయింట్ డైరెక్టర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు రూ.78,800 – రూ.2,09,200 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 10 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 2 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.icsi.edu
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 53
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 2
The post ICSI Recruitment: డీగ్రీ, బీటెక్ పాసైతే చాలు.. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.. జీతం రూ.2,50,000