ఇమ్యూనిటీ చాలా త్వరగా పెరుగుతుంది.. జ్వరం, నీరసం అన్నీ తగ్గుతాయి..!

Immunity : ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో జ్వరం బారిన పడుతూ ఉంటారు. జ్వరం రావడమనేది ప్రస్తుత కాలంలో సర్వ సాధారమైపోయింది. అయితే జ్వరం వచ్చినప్పుడు ఏది తినాలనిపించదు.
అలాగే ఆకలి వేయదు. నాలుక చేదుగా ఉంటుంది. అసలు నోటికి ఏది తిన్నా కూడా రుచే ఉండదు.కేవలం జ్వరం వచ్చినప్పుడే కాదు వివిధ అనారోగ్య సమస్యల బారినపడినప్పుడు కూడా నోటికి రుచి తెలియదు. అలాంటప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల వెంటనే ఆకలి వేస్తుంది.


నోటికి రుచి తిరిగి వస్తుంది. అంతేకాకుండా ఈచిట్కాను వాడడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి.

మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం నిమ్మకాయను ఉపయోగించాల్సి ఉంటుంది.

ఇది అరుచిని దూరం చేస్తుంది. నాలుకపై ఉండే రుచి గుళికలను ఉత్తేజం చేస్తుంది. అలాగే నిమ్మకాయ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

నిమ్మకాయతో పాటు మనం మిరియాల పొడిని, సైంధవ లవణాన్ని, నల్ల ఉప్పును కూడా ఉపయోగించాల్సి ఉంటుంది.

ముందుగా అర చెక్క నిమ్మకాయను తీసుకుని దానిలో ఉండే గింజలను తీసి వేయాలి. తరువాత దీనిపై రెండు చిటికెల మిరియాల పొడిని, 2 లేదా 3 చిటికెల సైంధవ లవణాన్ని, ఒక చిటికెడు నల్ల ఉప్పును వేయాలి. తరువాత ఈ నిమ్మ చెక్కను నేరుగా మంట మీద ఉంచి 2 నుండి 3 నిమిషాల పాటు వేడి చేయాలి.

తరువాత దీనిని కొద్దిగా చల్లారనివ్వాలి. నిమ్మకాయ కొద్దిగా చల్లారిన తరువాత దాని నుండి రసాన్ని పిండాలి. ఇప్పుడు ఈ నిమ్మ రసాన్ని స్పూన్ తో తీసుకుని కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తాగాలి. తినగలిగిన వారు నేరుగా ఈ నిమ్మ చెక్కను నోట్లో వేసుకుని చప్పరించవచ్చు.

ఇలా నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల రుచి గుళికలు ఉత్తేజితమవుతాయి. నోటికి రుచి తెలుస్తుంది. ఆకలి పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. ఈ విధంగా జ్వరం వంటి అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు నిమ్మకాయను ఈ విధంగా తీసుకోవడం వల్ల నోటికి రుచి తెలియడంతో పాటు ఆకలి కూడా పెరుగుతుంది.