రోజుకు రూ.2 వేల ఆదాయం.. సీజన్‌లో మంచి వ్యాపారం.

పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి. పనస తొనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనిలో ఉండే పోషకాలు , విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.
అయితే ఈ వేసవి కాలంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పనస పండ్లు ఇక్కడ కనబడlr పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పనస తోటలు తక్కువగా ఉండటం దీనికి బలమైన కారణం అని చెబుతున్నారు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం మార్కెట్ పనస పండ్లు వ్యాపారులు. ప్రస్తుతం మార్కెట్ లో పనస పండ్లు వ్యాపారం తక్కువగా చేస్తున్నాము అని పనస పండ్లు తోటలో అందుబాటులో లేకపోవడం తో ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నాము అని పనస తోటలలో ఒక్కొక్క చెట్టు 2000 రూపాయలు చొప్పున కొనుగోలు చేసి ఆ చెట్టుకు ఉన్నా కాయలని దింపి పండేసుకుని మార్కెట్ లో తొనలు లెక్క విక్రయిస్తున్నాము అని చెబుతున్నారు.