Samantha: సమంత అతనితో నిజంగానే డేటింగ్ చేస్తుందా?

సమంత ప్రేమలో పడిందా? ఆ దర్శకుడితో డేటింగ్ చేస్తుందా?… ఇది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది. పుకార్లతో సమంత మౌనం వహించడం చర్చకు దారి తీస్తుంది. తాజా ఫోటో మరోసారి సమంత ఎఫైర్ రూమర్స్ తెరపైకి తెచ్చింది.


నాగ చైతన్యతో విడిపోయిన సమంత మీద పలు ఆరోపణలు వినిపించాయి. ఆమెకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని, పెళ్లయ్యాక కూడా బోల్డ్ సీన్స్ చేస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. అలాగే తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుగల్కర్ తో సమంతకు ఎఫైర్ ఉందని నిరాధార కథనాలు వెలువడ్డాయి. స్పందించిన ప్రీతమ్ ఆమె నాకు సిస్టర్ తో సమానం. సమంతతో నాకు ఎలాంటి రిలేషన్ ఉందో నాగ చైతన్యకు కూడా తెలుసంటూ వివరణ ఇచ్చాడు.

సమంత కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అలాగే తనకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టిన నేపథ్యంలో చికిత్స తీసుకుంటుంది. సమంత సింగిల్ స్టేటస్ అనుభవిస్తుంది. అయితే దర్శకుడు రాజ్ నిడిమోరు తో సమంత రిలేషన్ లో ఉందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో ఫేమస్ అయిన రాజ్ అండ్ డీకే లలో రాజ్ నిడిమోరు ఒకరు. వీరిద్దరూ తెలుగు దర్శకులే. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత లీడ్ రోల్ చేసింది. ఈ సిరీస్ సక్సెస్ కాగా.. సమంతకు నార్త్ లో ఫేమ్ తెచ్చింది. సమంత ఈ సిరీస్ లో కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో నటించడం విశేషం.

సమంత నటించిన రెండో వెబ్ సిరీస్ హనీ బన్నీ సైతం రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. ముచ్చటగా మూడోసారి రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ కోసం పని చేస్తున్నారు. ఆదిత్య రాయ్ కపూర్, సమంత నటిస్తున్న ఈ సిరీస్ కి రాజ్ అండ్ డీకే దర్శకులు. నెట్ఫ్లిక్స్ లో రక్త్ బ్రహ్మాండ్ స్ట్రీమ్ కానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా రాజ్ తో సమంత ఉన్న ఫోటోలు వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే పుకార్లను బలపరుస్తున్నాయి. ఆ మధ్య బాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. సమంత, రాజ్ ఈ వార్తలపై స్పందించలేదు. తాజాగా వీరిద్దరూ కలిసి ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటున్న ఫోటో బయటకు వచ్చింది.

రాజ్-సమంతల మధ్య సంథింగ్ సంథింగ్ నిజమే అని మరలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజ్ కి ఆల్రెడీ వివాహమైంది. భార్యకు విడాకులు ఇచ్చినట్లు సమాచారం. ఇక నాగ చైతన్యకు సమంత 2021లో విడాకులు ఇచ్చింది. కాగా నాగ చైతన్య ఇటీవల హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా వారి వివాహం జరిగింది.