ఓటీటీ లో సూపర్ హిట్ గా నిల్చిన శర్వానంద్ ‘మనమే’

ఒకప్పుడు మన టాలీవుడ్ యూత్ ఆడియన్స్ లో శర్వానంద్(Sharwanand) కి నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) తో సమానమైన క్రేజ్ ఉండేది. బాక్స్ ఆఫీస్ పరంగా ఎక్కువగా వీళ్ళిద్దరిని పోలుస్తూ ఎన్నో కథనాలు వచ్చేవి. వీళ్ళిద్దరిలో ఎవరిదీ పై చేయి, ఎవరు గొప్ప వంటి పోలికలు కూడా చేస్తూ ఉండేవారు అప్పట్లో. కానీ ఇప్పుడు నాని ఏ స్థాయిలో తన మార్కెట్ పరిధిని పెంచుకున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. వరుసగా హిట్టు మీద హిట్ కొడుతూ స్టార్ హీరోల లీగ్ కి అతి చేరువలో ఉన్నాడు. మరోపక్క శర్వానంద్ మాత్రం వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కనీసం మీడియం రేంజ్ హీరో అనే ట్యాగ్ కి దూరం అయిపోయాడు. ఇప్పుడు శర్వానంద్ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ జరగడమే కష్టమైపోయింది. ఆ రేంజ్ లో ఆయన మార్కెట్ పడిపోయింది. ఆయన చివరిసారి వెండితెర మీద కనిపించిన చిత్రం ‘మనమే’


కృతి శెట్టి(Krithi Shetty) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ రేంజ్ ఫలితాన్ని సొంతం చేసుకుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా విడుదలై ఏడాది దాటినా ఇంకా థియేటర్స్ కి రాలేదేంటి అని చాలా మంది అనుకునేవారు. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని భారీ మొత్తంలోనే కొనుగోలు చేసింది. అయితే నిర్మాతకు, సంస్థకు మధ్య కొన్ని ఫైనాన్సియల్ లిటికేషన్స్ ఉండడంతో ఇన్ని రోజులు ఓటీటీ ఆడియన్స్ కి ఈ చిత్రం అందుబాటులోకి రాలేదు. ఎట్టకేలకు ఈ సినిమాని గత వారం 7వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసారు. థియేటర్స్ లో యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది కానీ, ఓటీటీ లో మాత్రం బంపర్ రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది.

అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి తొలి మూడు రోజులకు కలిపి 1 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయని అంటున్నారు. ఒక ఫ్లాప్ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది చిన్న విషయం కాదు. అది కూడా చాలా మంది ఈ సినిమా ఒకటి ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఉంటారు. అలాంటి స్థితి లో ఉన్నప్పుడు ఈ మాత్రం రెస్పాన్స్ రావడం గొప్పే కదా. ఇకపోతే శర్వానంద్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అదే విధంగా ఆయన ‘నారి నారి నడుమ మురారి’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తిగా కమర్షియల్ నేపథ్యం లో తెరకెక్కుతున్న సినిమాలు. అందులో యూవీ క్రియేషన్స్ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కాబట్టి ఈ రెండిట్లో కచ్చితంగా ఆయన ఒక సూపర్ హిట్ అందుకుంటాడని అనుకుంటున్నారు ఫ్యాన్స్.