JEE Advanced 2024 Results: దేశంలో ఐఐటీలు సహా ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి.
జూన్ 9న ఉదయం 10 గంటలకు ఫలితాలను ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. ఈ ఏడాది మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది వరకు పరీక్షకు హాజరయ్యారు.
జేఈఈ అడ్వాన్స్డ్ – 2024 ఫలితాలు ఇలా చూసుకోండి..
* ఫలితాల కోసం విద్యార్థులు మొదటి అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. – https://jeeadv.ac.in/
* అక్కడ హోంపేజీలో కనిపించే JEE (Advanced) 2024 Results లింక్ మీద క్లిక్ చేయాలి.
* ఫలితాలకు సంబంధించిన లాగిన్ పేజీలో విద్యార్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వివరాలు నమోదుచేయాలి.
* జేఈఈ అడ్వాన్స్డ్ – 2024 ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
* ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
జేఈఈ అడ్వాన్స్డ్ – 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..