కొత్త ఏడాదిలోకి వచ్చిన తర్వాత ఐటీ ఇండస్ట్రీలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ ఊపందుకున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు మెగా వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి.
దీంతో ఐటీ ఉద్యోగాల కోసం ఎదురు చేసే వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. కోచింగ్ సెంటర్లు సైతం తిరిగి క్లాస్‌లను మొదలు పెడుతున్నాయి. అయితే, ఫీజులు చెల్లించి ఐటీ కోర్సులను నేర్చుకునే స్తోమత లేని అభ్యర్థులకు ఓ కెరీర్ గైడెన్స్ సెంటర్ ఫ్రీగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోనే కోచింగ్‌తో పాటు జాబ్ గ్యారంటీని అందిస్తోంది. మీరు కూడా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి.
ది సియాసట్ మహబూబ్ హుస్సేన్ జిగర్ కెరీర్ గైడెన్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ అభ్యర్థులకు ‘పైథాన్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ బూట్‌క్యాంప్’ పేరిట ఉచితంగా ఫ్రీ జాబ్ ట్రైనింగ్ ఉండనుంది. ఫిబ్రవరి 3న ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొదలు కానుంది. ఇందులో పాల్గొని తమ ఉద్యోగ అవకాశాలు ఇంప్రూవ్ చేసుకోవాలని గైడెన్స్ సెంటర్ నిర్వహకులు అభ్యర్థులకు సూచిస్తున్నారు. ఐటీ ఇండస్ట్రీలో ఫుల్ స్టాక్ డెవలపర్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ కోర్సు ఎంతో మందికి ఉపయోగపడనుంది.
ట్రైనింగ్ వివరాలు
ట్రైనింగ్‌లో భాగంగా అభ్యర్థులకు టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు. సాఫ్ట్‌వేర్ వెబ్ డెవలప్‌మెంట్‌లో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీలపై ట్రైనింగ్ ఇస్తారు. HTML, CSS, JavaScript, Python, MYSQL, Django వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలు ఇందులో ఉన్నాయి. కమ్యూనికేషన్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం, ప్రాబ్లెమ్ సాల్వింగ్ స్కిల్స్ గురించి వివరిస్తారు. చాట్‌జీపీటీ, జెమిని వంటి ఏఐ టూల్స్‌ని ఎలా వాడాలో చెబుతారు. దీంతో పాటు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గురించి మెలకువలు నేర్పిస్తారు. జాబ్ ఇంటర్వ్యూలను కాన్ఫిడెంట్‌గా ఎలా ఫేస్ చేయాలో చెబుతారు. మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థుల్లో కాన్ఫిడెన్స్‌ని పెంచుతారు. ఇవేగాకుండా, కంపెనీలో పని విధానం ఏ విధంగా ఉంటుంది? కార్పొరేట్ కల్చర్, తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు.
అర్హులు ఎవరంటే?
హైదరాబాద్‌లో పైథాన్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ బూట్‌క్యాంప్ ట్రైనింగ్‌లో చేరడానికి అభ్యర్థులకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. ముందుగా కోడింగ్ అనుభవం లేకున్నా ఇందులో చేరొచ్చు. నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారు ఇందులో మెరుగ్గా పర్ఫార్మ్ చేయొచ్చు. కెరీర్ అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, వెబ్ డెవలప్‌మెంట్‌లో పైథాన్ లాంగ్వేజ్‌నే వాడతారు. కాబట్టి, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసిన డెవలపర్లకు ఎంతో డిమాండ్ ఉంటుంది. ఉద్యోగంలో ఎంపికైన వారికి ఏడాదికి రూ.6 లక్షల వరకు జీతం ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
కోర్సులో చేరాలన్న ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 9000191481 లేదా 9393876978 ఫోన్ నంబర్లకు కాల్ చేసి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.
జాబ్ ఎక్కడ?
ఈ కోర్సు ట్రైనింగ్ ఫిబ్రవరి 3న సాయంత్రం 6:30 గంటలకు మొదలు కానుంది. హైదరాబాద్‌లోని అబిడ్స్ రామకృష్ణ థియేటర్‌కు ఎదురుగా ఉన్న సియాసట్ ఆఫీసులో అభ్యర్థులు సంప్రదించాల్సి ఉంటుంది. కోచింగ్ కూడా ఇందులోని మహబూబ్ హుస్సేన్ జిగర్ హాల్‌లో ఉండనుంది.