బంగారం ధర భారీగా పెరిగింది. మరోసారి ఆల్ టైం రికార్డ్ స్థాయి దిశగా బంగారం అడుగులు వేస్తోంది. బంగారం పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులే కారణంగా చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 86,240 రూపాయలు పలుకుతుండగా, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 77,650 రూపాయలు పలికింది. అదే సమయంలో ఒక కేజీ బంగారం ధర రూ. 96,699 పలికింది. బంగారం ధర చరిత్రలోనే తొలిసారిగా 86 వేల రూపాయలు దాటింది. బంగారం ధరలు పెరగడానికి ముఖ్యంగా డాలర్ విలువ భారీగా పెరగడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు ప్రస్తుతం ఒక డాలర్ విలువ 87. 11 రూపాయలకు పతనం అయ్యింది. ఇది చరిత్రలోనే అత్యంత కనిష్టమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.
బంగారం ధర పెరగడానికి మరో ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి చర్యల కారణంగానే ప్రస్తుతం అమెరికా సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని కొంతమంది నిపుణుల అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే డోనాల్డ్ ట్రంప్ ఇటీవల మెక్సికో కెనడా పైన ప్రకటించిన ఆంక్షలు కొరడాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ మెక్సికో కెనడా పట్ల కఠినంగానే ఉంటామని తెలిపారు. మరోవైపు మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమైన నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. . ఈ కారణంగా కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే బంగారం ధర అతి త్వరలోనే 90 వేల స్థాయికి చేరే అవకాశం కనిపిస్తోంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇబ్బందికరంగా మారింది.
ముఖ్యంగా ఒక పసిడి ఆభరణం తయారు చేయించుకోవాలంటే స్థానిక జిఎస్టి పనులు కలుపుకొని ఆభరణం ధర భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ రేపధ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఈ ట్రెండు ఇబ్బంది అని చెప్పవచ్చు. అయితే అటు అమెరికాలో సైతం బంగారం ధర ఏకంగా ఒక ఔన్సు (31.1 గ్రాములు) 2850 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది కూడా బంగారం ధర పెరగడానికి కారణ అని చెప్పవచ్చు. ఇదే ట్రెండు కొనసాగినట్లయితే బంగారం ధర త్వరలోనే ఒక లక్ష రూపాయలు తాకడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.