SSC Pre-Final Exam Time Table 2025: పదో తరగతి విద్యార్ధులకు ప్రీ ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రీ-ఫైనల్ పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం, మరో వారంలో ప్రీ-ఫైనల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ప్రీ-ఫైనల్ పరీక్షలు ఆయా తేదీలలో ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. పబ్లిక్ పరీక్షలు కూడా ఇదే విధంగా జరుగుతాయి కాబట్టి, విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.


2024-25 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రీ-ఫైనల్ పరీక్షల టైమ్ టేబుల్‌ను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 10 నుండి 10వ తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పబడింది. ఈ మేరకు షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించారు. ప్రీ-ఫైనల్ పరీక్షలు ఆయా తేదీలలో ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి.

10వ తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షల పూర్తి టైమ్ టేబుల్ ఇది..

  • ఫిబ్రవరి 10వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్ A), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 (కాంపోజిట్ కోర్సు) పరీక్షలు
  • ఫిబ్రవరి 11వ తేదీ సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష
  • ఫిబ్రవరి 12వ తేదీ ఇంగ్లీష్ పరీక్ష
  • ఫిబ్రవరి 13వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్ కోర్సు), OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) పరీక్ష
  • ఫిబ్రవరి 15వ తేదీ మ్యాథమెటిక్స్ పరీక్ష
  • ఫిబ్రవరి 17వ తేదీ ఫిజిక్స్ పరీక్ష
  • ఫిబ్రవరి 18వ తేదీ బయాలజీ పరీక్ష
  • ఫిబ్రవరి 19వ తేదీ OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), SSC వొకేషనల్ కోర్సు (థియరీ) పరీక్ష
  • ఫిబ్రవరి 20న సోషల్ స్టడీస్ పరీక్ష

విద్యా శాఖ ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల టైమ్ టేబుల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. పబ్లిక్ పరీక్షలు మార్చి నెలలో ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ఆయా తేదీలలో ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. భౌతిక శాస్త్రం మరియు జీవ శాస్త్ర పరీక్షా పత్రాలు ప్రతి రోజు ఉదయం 9.30 నుండి 11.30 వరకు జరుగుతాయి. మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి. షెడ్యూల్ ప్రకారం, ఈ పరీక్షలు మార్చి 17 నుండి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయి.