సింహం.. కాదు కుక్క! మంచు విష్ణు, మనోజ్ ట్వీట్ వార్

మంచు కుటుంబంలో కలహాలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు, మనోజ్ ఒకరిపై ఒకరు సంచలన విమర్శలు చేసుకున్నారు. ‘భక్తకన్నప్ప’లో కృష్ణంరాజులాగా సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుందంటూ మంచు మనోజ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది. అయితే, మంచు విష్ణు పెట్టిన ఓ పోస్టుకు సమాధానంగా మనోజ్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

నా ఫేవరేట్ మూవీ.. అందులోని డైలాగ్ అంటూ విష్ణు శుక్రవారం మధ్యాహ్నం మోహన్ బాబు ఆడియో క్లిప్ షేర్ చేశారు. తన తండ్రి మోహన్ బాబుతో విష్ణు కలిసి నటించిన ‘రౌడీ’ చిత్రంలోని ఓ డైలాగ్ ఆడియో ఇది. ‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది. కానీ, వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ’ అనే డైలాగ్ అందులో వినిపించింది.

ఇక, విష్ణు పోస్టు పెట్టిన గంటల్లోనే మనోజ్ దానికి కౌంటర్‌ అన్నట్లుగా ఓ పోస్టు పెట్టారు. కృష్ణంరాజు నటించిన తాండ్రపాపారాయుడు, భక్తకన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న పోస్టర్లను పంచుకుంటూ మనోజ్ ట్వీట్ చేశారు. ‘భక్త కన్నప్ప’లో కృష్ణంరాజులాగా.. సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్’ అని మంచు మనోజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో వివాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం వరకూ వెళ్లింది. రిపోర్టర్ పై దాడి చేయడంతో మంచు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. ఇటీవల మోహన్ బాబు విద్యాసంస్థ వద్దకు మనోజ్ వెళ్లడంతో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆ తర్వాత తాజాగా మరోసారి మంచు సోదరులు సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. వీటిపై అభిమానులు, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.