పాఠశాల లేదా కళాశాల ఫీజులు చెల్లించడానికి రూ. 2 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు రుణాలు

అయితే స్కూల్ ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడుతున్న వారికి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఆక్సిలో ఫిన్సర్వ్ ఎటువంటి వడ్డీ లేకుండా ఫీజుల కోసం ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తుంది.


ఇండియా ఎడ్ పేరుతో ఇటువంటి వడ్డీ లేకుండా మీరు ఫీజుల కోసం విద్యా రుణాలను పొందవచ్చు. ఈ మధ్యకాలంలో పిల్లల చదువు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. విద్యా ద్రవయోల్బణం భారీగా పెరిగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. విశ్లేషకుల అంచనా ప్రకారం రానున్న రోజుల్లో ఇవి మరింత పెరగవచ్చు. ఎల్కేజీ చదువుతున్న పిల్లలకి కూడా స్కూల్స్లో వేల నుంచి లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక ఇంటర్, డిగ్రీ లేదా పీజీ కోర్సులు చదువుతున్న వారి ఫీజుల గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. వాళ్ల ఫీజులు లక్షల్లో ఉంటాయి. ఈ క్రమంలో చాలామంది పిల్లల చదువులకు అవసరమైన ఫీజులను చెల్లించడంలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధిక వడ్డీకి వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు కూడా తీసుకుంటున్నారు.

ఈ విధంగా ఫీజుల కోసం ఇబ్బంది పడే వారికి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. మీరు ఎటువంటి వడ్డీ చెల్లించకుండా ఫీజులు కట్టడానికి రుణం తీసుకోవచ్చు. ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ అయిన ఆక్సిలో ఫిన్ సర్వ్ విద్యార్థులకు ఫీజులు కట్టేందుకు ఇండియా ఎడ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. మీరు మీ పిల్లల స్కూలు లేదా కాలేజీ ఫీజులను చెల్లించడానికి ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందుతుంది. ఇటువంటి వడ్డీ లేకుండా మీరు రుణాలు తీసుకోవచ్చు. విద్యార్థులు ఫీజులు చెల్లించడానికి ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి వడ్డీరహిత రుణాలను అందిస్తున్నట్లు తాజాగా వెల్లడించారు.

వీటికి సంబంధించి ఆక్సిలో ఫిన్సర్వ్ ఇప్పటికే అనేక స్కూల్స్, కాలేజీలు మరియు కోచింగ్ సెంటర్లు అలాగే ఎడ్ టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. విద్యార్థుల ఫీజులను చెల్లించేందుకు రూ.రెండు లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లోన్ ఇస్తామని తెలిపింది. ఆక్సిలో ఫిన్సర్వ్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆనంద సుబ్రహ్మణ్యం విద్యార్థుల స్కూలు లేదా కాలేజీ ఫీజుల కోసం రెండు నుంచి పది లక్షల వరకు వడ్డీ రహిత రుణాలను ఇస్తామని తాజాగా తెలిపింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.