శివుడు వరం పొందాలనుకుంటున్నారా? వీటిని ఇంటికి తెచ్చుకోండి చాలు

పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 26న మహాశివరాత్రి జరుపుకుంటారు. మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజైన మహాశివరాత్రి కోసం శివభక్తులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు.


ప్రతినెలా మాస శివరాత్రి వస్తుంది.. కానీ మహా శివరాత్రి ఏడాదికి ఒక్కసారే వస్తుంది. సంవత్సరానికి ఒకసారి ఫాల్గుణ మాసంలో మాత్రమే మహాశివరాత్రి జరుపుకుంటారు. హిందూ మతంలో మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, రోజంతా శివనామాన్ని స్మరించడం, ప్రదోషకాలంలో శివున్ని అభిషేకిస్తారు. శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం చేస్తారు.

ఉపవాస నియమాలతో మహాశివరాత్రి రోజున శివుడిని భక్తిశ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుందని నమ్మకం. అయితే మహాశివరాత్రి రోజున ఇంటికి కొన్ని శుభ వస్తువులను తీసుకురావడం చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

రాగి కుండీ

మహాశివరాత్రి రోజున రాగి కుండ కొని ఇంటికి తెచ్చుకోవడం ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇది కుటుంబంలో మాధుర్యాన్ని, శ్రేయస్సును కాపాడుతుంది. మహాశివరాత్రి రోజున శివుని శివలింగంపై రాగి పాత్ర నుండి నీటిని పోయడం శుభప్రదంగా భావిస్తారు.

రుద్రాక్ష

మత విశ్వాసాల ప్రకారం రుద్రాక్షను శివుని రూపంగా భావిస్తారు. 108 రుద్రాక్ష పూసలు ఉన్న ఇల్లు శివుడి రక్షణతో దీవించబడుతుందని నమ్ముతారు. కాబట్టి మహాశివరాత్రి నాడు రుద్రాక్షను ఇంటికి తీసుకురావడం ముఖ్యమని పండితులు తెలిపారు. రుద్రాక్ష మీ అన్ని వ్యాధులు, లోపాలు, దుఃఖాలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతారు.

వాహనాలు, వెండి వంటి లోహాలను

మహాశివరాత్రి రోజున వాహనాలు, వెండి వంటి లోహాలను కొనుగోలు చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. దీనివల్ల ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు.

శివలింగం

మహాశివరాత్రి రోజు శివలింగాన్ని ఇంటికి తీసుకురావడం ద్వారా వాస్తు దోషం, కాలసర్ప దోషం, పితృ దోషాలను వదిలించుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఈ శివలింగం శివపూజకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది.

మొక్కలను తీసుకురావడం

మహాశివరాత్రి రోజున మీ ఇంట్లో ధూతుర, బెల్పత్ర, అశ్వత్థ, మర్రి మొదలైన చెట్లను నాటడం వల్ల శుభం, సానుకూల శక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.