టీడీపీలోకి మంచు మనోజ్!

మంచు ఫ్యామిలీలో విబేధాలు రచ్చకెక్కిన వేళ మరో సంచలన విషయం బయటకొచ్చింది. తండ్రి, సోదరుడిని ఎదుర్కొనేందుకు రాజకీయ అండ కోసం చూస్తున్న మనోజ్ టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.


నారాలోకేశ్తో 45 నిమిషాలకు పైగా చర్చలు జరపడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.

భూమ అఖిలప్రియ మద్ధతు..

ఈ మేరకు తండ్రి, సోదరుడితో నెలకొన్న ఆస్తి గొడవల్లో రాజకీయ అండకోసం మంచు మనోజ్ టీడీపీ వైపు చూస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు త్వరలో టీడీపీలో చేరేందుకు మనోజ్ సిద్ధమయ్యాడనే ప్రచారం జోరందుకుంది. బుధవారం మోహన్బాబు యూనివర్సిటీకి వెళ్లిన మనోజ్ అక్కడి నుంచి నేరుగా.. నారావారిపల్లెకు వెళ్లి నారాలోకేశ్ను కలిశారు. ఆయనతో 45 నిమిఫాలపాట్ చర్చించారు. మనోజ్ భార్య భూమ మౌనిక సోదరి భూమ అఖిలప్రియ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండడం కూడా దీనికి మరింత బలం చేకూర్చుతుంది.