సిగ్గుచేటు.. వేడుకలో చొక్కా ఎత్తి వక్షోజాలు చూపించిన మంత్రి

సిగ్గుచేటు.. వేడుకలో చొక్కా ఎత్తి వక్షోజాలు చూపించిన మంత్రి


Viral News: ఓ మంత్రి అయ్యుండి వేడుకలో అందరి ముందు చొక్కా ఎత్తి మరీ వక్షోజాలను చూపించింది ఆ మహిళ. ఈ షాకింగ్ ఘటన నార్వేలో చోటుచేసుకుంది. నార్వేకి చెందిన లుబ్నా అనే 40 ఏళ్ల మహిళ కల్చర్ అండ్ జెండర్ ఈక్వాలిటీ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తోంది.

ఈ నేపథ్యంలో నిన్న నార్వేలో ఓస్లో పేరిట ప్రైడ్ ఈవెంట్ ఏర్పాటుచేసారు. అంటే అన్ని లింగాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నమాట. ఈ వేడుకలో పాల్గొన్న లుబ్నా స్టేజ్ మీదకు ఎక్కి అందరి ముందు చొక్కా ఎత్తి వక్షోజాలు చూపించింది. అంటే.. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సరిసమానమే అని చెప్పడం ఆమె ఉద్దేశం అయ్యుంటుంది.

ఓ మహిళ.. అందులోనూ మంత్రి అయ్యుండి ఇలా చేయడం పట్ల హెచ్చరించాల్సింది పోయి ఆ దేశ ప్రధాని కూడా అభినందనలు తెలిపారు. లుబ్నా చేసింది నిజంగా సాహసోపేతమైన మంచి పని అని వారు కొనియాడటం కొసమెరుపు. అసలు ఆమె చర్యను ఏ విధంగా తీసుకోవాలో కూడా అర్థంకావడలేదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.