ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 20కి పైగా సినిమాలు, సిరీస్‌లు

ప్రతి శుక్రవారం థియేట్రికల్‌ రిలీజ్‌తో పాటు ఓటీటీల్లో వచ్చే సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి వారం పదుల కొద్ది సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తే..


ఈ వారం ఏకంగా 20కి పైగా సినిమాలు, సిరీస్‌లు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇందులో పది సినిమాలు తెలుగులోనూ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కమల్ హాసన్‌ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘థగ్‌ లైఫ్‌’ కూడా ఉంది. థియేటర్స్‌లో డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కీర్తి సురేష్, సుహాస్‌ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ‘ఉప్పు కప్పురంబు’ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్మశానానికి హౌస్ ఫుల్‌ బోర్డు పెట్టాల్సిన సమస్య నేపథ్యంలో సాగే సెటైరికల్ రూరల్ కామెడీ డ్రామా ఇది. అలాగే ‘జగమెరిగిన సత్యం’ అనే తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్‌ సన్‌ నెక్స్ట్‌ ఓటీటీలో శుక్రవారం వస్తోంది. ఇదే ఓటీటీలో ‘మద్రాస్‌ మ్యాట్నీ’ తమిళ థ్రిల్లర్‌ డ్రామా తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ గురువారం నుంచి స్ట్రీమ్ అవుతోంది. ‘ఆల్ ఇండియా ర్యాంకర్స్‌’ అనే కామెడీ వెబ్‌ సిరీస్‌ ఈటీవీ విన్‌లోకి వచ్చింది. ఇటీవల ‘కోర్ట్‌’తో హిట్ అందుకున్న హర్ష్ రోషన్‌, సునీల్, వైవా హర్ష, సందీప్ రాజ్ లీడ్ రోల్స్‌లో నటించారు.

ర్యాంకుల కోసం ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులపై ఎంతలా ప్రెజర్ పెడుతున్నాయనేది ఇందులో కంటెంట్. ఇక రాజీవ్ గాంధీ హత్య ఆధారంగా నగేష్ కుకునూన్ తెరకెక్కించిన ‘ది హంట్: ది రాజీవ్ గాంధీ అసాసియేషన్ కేస్‌’ సోనీ లీవ్‌లో శుక్రవారం నుంచి స్ట్రీమ్ అవుతుంది. అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్‌లో నటించిన ‘కాళీధర్‌ లాపతా’ అనే హిందీ చిత్రం జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’ అనే ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్‌ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. జియో హాట్‌ స్టార్‌లో ‘గుడ్‌ వైఫ్‌’ అనే తమిళ కోర్ట్ రూమ్ డ్రామా తెలుగు వెర్షన్‌తో పాటు ‘కంపానియన్‌’ అనే ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ అందుబాటులో ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.