నాని వంద కోట్ల సినిమా OTTలో విడుదల కానుంది.. అప్పటి నుండి హిట్ 3 స్ట్రీమింగ్

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3: ది థర్డ్‌ కేస్‌. గతంలో వచ్చిన హిట్ సిరీసుల్లో ఇది మూడో . మొదటి రెండు పార్ట్ లను తెరకెక్కించిన శైలేష్ కొలను హిట్-3ని ను తెరకెక్కించాడు.


కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య మే 01న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన హిట్-3 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. లో రక్త పాతం, హింస ఎక్కువైందని విమర్శలు వచ్చినా నాని ఉండడంతో హిట్-3 మూవీ ఆడియెన్స్ కు బాగా ఎక్కేసింది. ఈ మూవీ వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అలాగే ఓవర్సీస్ లోనూ నాని కు మంచి స్పందన వచ్చింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీని ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడనుంది. హిట్ 3 ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో హిట్ 3 ను మే 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ తన అప్ కమింగ్ మూవీస్ లిస్ట్‌లో హిట్ 3 మూవీని పెట్టేసింది. అయితే నెట్ ఫ్లిక్స్, హిట్ 3 టీం దీనిపై అధికారికంగా ప్రకటన రిలీజ్ చేయాల్సి ఉంది.

నాని హిట్3 కోసం నెట్ ఫ్లిక్స్ రూ. 50 కోట్లకు పైగానే చిత్ర బృందానికి చెల్లించినట్లు తెలుస్తోంది. వాల్‌పోస్టర్ , యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని, నానిలు హిట్ 3 చిత్రాన్ని నిర్మించారు. నాని, శ్రీనిధి శెట్టిలతో పాటు సూర్య శ్రీనివాస్, రావు రమేష్, సముద్ర ఖని, కోమలి ప్రసాద్, నెపోలియన్, రవీంద్ర విజయ్, ప్రతీక్ బబ్బర్, టిస్కా చోప్రా తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే అడవిశేష్, కార్తీ క్యామియో రోల్స్ లో కనిపించారు. ఈ కు మిక్కీ జే. మేయర్ స్వరాలు సమకూర్చాడు. మరి థియేటర్లలో హిట్ 3 ను మిస్ అయ్యారా? లేదా మళ్లీ నాని ను చూడాలనుకుంటున్నారా? అయితే మరో 4 రోజులు వెయిట్ చేయండి.