సైన్స్ స్ట్రీమ్ విద్యార్థులు 12వ తరగతి లేదా ఇంటర్మీడియెట్ తరువాత కేవలం ఇంజనీరింగ్, లేదా మెడిసిన్ వైపే చూస్తుంటారు. కానీ, ఈ రెండే కాకుండా, అద్భుత కెరీర్ అవకాశాలను అందించే రంగాలు చాలా ఉన్నాయి. టెక్నాలజీ, రీసెర్చ్, ఇన్నోవేషన్ యుగంలో భవిష్యత్ అవసరాలకు సరిపోయే కెరీర్ ఆప్షన్లు ఎన్నో ఉన్నాయి.
నేటి యుగం శరవేగంగా మారుతోంది, ప్రతి రంగంలోనూ టెక్నాలజీ, ఆరోగ్యం, పర్యావరణం, డేటాలో విప్లవం జరుగుతోంది. అలాంటప్పుడు 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు డాక్టర్, ఇంజినీర్ మాత్రమే కెరీర్ ఆప్షన్లు కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా 12వ తరగతి తర్వాత ఉత్తమ కెరీర్ ఆప్షన్స్ ఏంటో తెలుసుకుందాం.
డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) – డేటా అనేది నేటి ప్రపంచంలో కొత్త అవసరం. హెల్త్, ఫైనాన్స్, ఈ-కామర్స్ ఇలా అన్ని రంగాల్లో డేటా సైంటిస్టులు, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. 12వ తరగతి తర్వాత కంప్యూటర్ సైన్స్, ఏఐ లేదా డేటా సైన్స్ లో B.Sc చేయడం ద్వారా ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. ప్రారంభ వేతనం సంవత్సరానికి 8-10 లక్షల వరకు ఉంటుంది మరియు అనుభవంతో ఇది కోట్ల వరకు చేరుతుంది.
బయోటెక్నాలజీ అండ్ జెనెటిక్స్ – కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచం మొత్తం బయోటెక్నాలజీ శక్తిని గుర్తించింది. వ్యాక్సిన్ డెవలప్మెంట్, జెనెటిక్ రీసెర్చ్, ఫార్మాస్యూటికల్స్, అగ్రిటెక్ రంగాల్లో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. B.Sc బయోటెక్నాలజీ లేదా జన్యుశాస్త్రంలో, పరిశోధన నుండి పరిశ్రమలో పరిశోధన మరియు అభివృద్ధి వరకు పెద్ద పాత్రలను పోషిస్తాయి.
ఫొరెన్సిక్ నిపుణులు అందించే వివరాలు నేరస్తులను గుర్తించడంలో ఎలా ఉపయోగపడుతాయో ఫోరెన్సిక్ సైన్స్ – క్రైమ్ సిరీస్ లు, సినిమాల్లో చూస్తుంటాం. ఫొరెన్సిక్ సైన్స్ రంగంలో గొప్ప కెరీర్ ను రూపొందించుకోవచ్చు. ఈ ఫోరెన్సిక్ సైన్సెస్ లో బీఎస్సీ, లేదా ఎమ్మెస్సీ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, సీబీఐ, ఎన్ఐఏ వంటి సంస్థల్లో సైంటిఫిక్ ఎక్స్ పర్ట్ లుగా పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది.
ఎన్విరాన్ మెంటల్ సైన్స్ అండ్ క్లైమేట్ స్టడీస్ – క్లైమేట్ ఛేంజ్ అనేది కేవలం చర్చనీయాంశం మాత్రమే కాదు, ఇది ఒక వృత్తి రంగంగా మారింది. 12వ తరగతి తర్వాత ఎన్విరాన్ మెంటల్ సైన్స్ లేదా సస్టెయినబిలిటీ స్టడీస్ లో B.Sc చేయడం ద్వారా ఎన్జీవోలు, ప్రభుత్వ పాలసీ థింక్ ట్యాంక్ లు, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేయవచ్చు. ఈ రంగం సామాజిక మార్పును తీసుకురావడమే కాకుండా ప్రపంచ కెరీర్ కు మార్గం సుగమం చేస్తుంది.
ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ లో రీసెర్చ్ – లోతైన అవగాహన, థియరీపై ఆసక్తి ఉంటే ఈ ఫిజిక్స్ లేదా మ్యాథ్స్ లో డిగ్రీ చేసి, అనంతరం ఆయా రంగాల్లో మరింత రీసెర్చ్ చేయవచ్చు. తద్వారా ఇస్రో, డీఆర్డీవో, బార్క్ వంటి సంస్థల్లో సైంటిస్ట్ అయ్యే అవకాశం లభిస్తుంది. వీటితో పాటు ఇంటర్నేషనల్ రీసెర్చ్ గ్రాంట్స్, పీహెచ్డీ ఫెలోషిప్లు కూడా లభిస్తాయి.