కవలలు అనగానే ఇద్దరూ చూసేందుకు ఒకేలా కనిపిస్తారు. కొన్ని సార్లు వాళ్లని గుర్త పట్టడం కూడా కష్టమే. అయితే వారి మార్కులు కూడా సేమ్‌గా ఉంటే ఎంత అశ్చర్యంగా ఉంటుంది కదూ. తమిళనాడుకు చెందిన కవలలు పదో తరగతి పరీక్షల్లో ఒకే మార్కులు సాధించింది అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
కోయంబత్తూరులోని రామనాథపురం ప్రాంతానికి చెందిన సుందరరాజన్, భారతి సెల్విల కుమార్తెలు కవిత, కనిక కవల పిల్లలు. ఈ ఇద్దరు అదే ప్రాంతంలోని మున్సిపల్ స్కూల్లో పదోతరగతి చదువుతున్నారు. అయితే తాజాగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. వాటిని తెలుసుకునేందుకు వెళ్లి ఈ సిస్టర్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇద్దరికీ ఒకే మార్కులు వచ్చాయి.
గణితంలోనూ సేమ్
కవిత మార్కులు చూస్తే, తమిళం- 95, ఇంగ్లీష్-98, గణితం – 94, సైన్స్ – 89, సోషల్– 98, మొత్తంగా 474 మార్కులు వచ్చాయి. ఇక కనిక మార్కులు చూసే, తమిళం– 96, ఇంగ్లీష్ – 97, గణితం – 94, సైన్స్ – 92, సామాజిక శాస్త్రం – 95, మొత్తంగా 474 మార్కులు వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గణితంలో ఇద్దరికి ఒకే మార్కులు వచ్చాయి.