పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారా..? జనసేన 11వ ఆవిర్భావ సభలో ఈ విషయం చెప్పకనే చెప్పారా..? పవర్ స్టార్‌కు ఓజి చివరి సినిమా కాబోతుందా..? ఉస్తాద్ భగత్ సింగ్‌పై సైతం ఫ్యాన్స్ ఆశలు వదిలేయాల్సిందేనా..? ఒకవేళ ఇదే నిజమైతే అకీరా నందన్ అరంగేట్రానికి సమయం ఆసన్నమైనట్లేనా..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం..
పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినా ఆయన నుంచి సినిమాలు రావాలనే అభిమానులు కోరుకుంటున్నారు. ఏడాదికో సినిమా ఏం అవసరం లేదు.. ఒప్పుకున్న సినిమాలైతే పూర్తి చేయాలంటూ కోరుతున్నారు
అందుకే ఆయనెక్కడ కనిపించినా.. ఓజి ఓజి అంటూ అరుస్తున్నారు. దీంతో పాటు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా కమిటయ్యారు పవన్. నిజానికి అజ్ఞాతవాసి తర్వాతే సినిమాలకు బ్రేక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
నాలుగేళ్ల తర్వాత మళ్లీ వకీల్ సాబ్ అంటూ వచ్చారు. ఆ తర్వాత భీమ్లా నాయక్, బ్రో సినిమాలు తక్కువ గ్యాప్‌లోనే చేసారు. అదే సమయంలో ఉస్తాద్‌తో పాటు వీరమల్లు, ఓజికి కమిటయ్యారు. ఇందులో ఓజి షూట్ చివరిదశకు వచ్చింది.. మరో రెండు వారాలు డేట్స్ ఇస్తే చాలు.

పవన్ కళ్యాణ్ చెప్తున్న దాన్నిబట్టి ఓజి ఆయనకు చివరి సినిమా అయ్యే అవకాశం లేకపోలేదు. అంటే అకీరా నందన్ అరంగేట్రానికి కూడా సమయం ఆసన్నమైనట్లే. అందుకే ఈ మధ్య తనయుడిని ప్రమోట్ చేస్తున్నారు పవర్ స్టార్. ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యేనాటికి.. వారసుడిని సిద్ధంగా ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.